అనకాపల్లి సమీపంలోని రావికమతంలో పెళ్లి ఇష్టం లేదని పుష్ప అనే యువతి కాబోయే భర్త గొంతు కోసిందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని చెప్పి పుష్ప.. తన కళ్లకు గంతలు కట్టి కత్తితో గొంతు కోసినట్లు బాధితుడు ఆరోపించాడు. అయితే ఈ కేసులో పుష్పతల్లి ట్విస్ట్ ఇచ్చింది. ఈ హత్యాయత్నంలో తమ పాపకు ఏ పాపం తెలియదంటూ, అతను చెప్పింది అబద్ధమని ఆ పుష్ప తల్లి తెలిపింది. ఆ యువతి తల్లి మాటలు ఇలా ఉంటే తాజాగా తానే బాధితుడు రామునాయుడిపై దాడి చేసినట్లు ఒప్పుకుంది. ఇలా ఈ కేసులో కొత్త కొత్త ట్విస్ట్ లు వెలుగులోకి వస్తున్నాయి.
కాబోయే భర్త రామునాయుడిపై తానే దాడి చేసినట్లు నిందితురాలు పుష్ప పోలీసుల ముందు ఒప్పుకుంది. తనకు అసలు పెళ్లే వద్దని ఎన్ని సార్లు చెప్పినా తల్లిదండ్రులు వినలేదని పుష్ప పోలీసులకు వెల్లడించింది. అయినా తల్లిదండ్రుల బలవంతంతో రామునాయుడితో పెళ్లికి పుష్ప ఒప్పుకుంది. ఈ క్రమంలోనే ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అందుకే బాధితుడిపై ఘోరానికి పాల్పడిందటా. చాలా కాలం నుంచి దైవ భక్తిలో ఉన్న పుష్ప.. తనకు పెళ్లి వద్దని, దేవుడి భక్తురాలిగా ఉండిపోతానంటూ తల్లిదండ్రులకు పలుమార్లు చెప్పిందట.
ఇదీ చదవండి: కాబోయే భర్త పీక కోసిన కేసులో షాకింగ్ ట్విస్ట్! కూతురికి తల్లి మద్దతు!
ఇప్పటికే రెండు పెళ్లి చూపులు రద్దుర కావడంతో ఈ పెళ్లికి పుష్పని బలవంతంగా ఒప్పించారు. ఈక్రమంలోనే పెళ్లి ఇష్టంలేని పుష్ప కాబోయే భర్తను బయటకు తీసుకెళ్లి చంపాలని పుష్ఫ పధకం వేసింది. సరదాగా బయటకు వెళ్దామంటూ కోరింది. గుడి దగ్గర రామునాయుడు కళ్లకు చున్నీ కట్టి.. సర్‌ప్రైజ్ అంటూ గొంతు కోసేసింది. టైం బాగుండి.. ప్రాణాలతో బయటపడ్డాడు రామునాయుడు. ఇలా ఈ కేసు విషయాంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెబుతున్నారు. ఈ మొత్తం కేసులో మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.