వివాహ బంధానికి మచ్చ తెచ్చే సంఘటనలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ఇప్పటివరకు భార్యను లైంగికంగా వేధించిన భర్తలను చూశాం.. స్నేహితులతో శృంగారంలో పాల్గొనాలంటూ ఒత్తిడి చేసిన భర్తలను చూశాం.. వీడు అంతకు మించి. ప్రమోషన్ కోసం కక్రుత్తి పడి.. భార్యను బాస్‌తో పడుకోవాలని బలవంతం చేశాడు.
వందేళ్ల జీవితంలో ఎందరో వస్తుంటారు.. పోతుంటారు. కానీ, చివరి వరకూ భార్యభర్తలే ఒకరికొకరు తోడంటూ పెద్దలు చెప్తుంటారు. ‘భార్యకి.. భర్త’, ‘భర్తకి.. భార్య’.. ఇలా ఇద్దరూ కలిసిమెలిసి జీవితాంతం కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలని చెప్తుంటారు. కానీ, కాలం మారుతున్న కొద్దీ ఆ వివాహ బంధానికి మచ్చ తెచ్చే సంఘటనలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ఇంతకుముందు భార్యను తన స్నేహితులతో శృంగారంలో పాల్గొనాలంటూ ఒత్తిడి చేసిన భర్తను చూశాం.. వీడు అంతకు మించి. ప్రమోషన్ కోసం కక్రుత్తి పడి.. భార్యను బాస్‌తో పడుకోవాలని బలవంతం చేశాడు. ఆ వివరాలు..
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఒక మహిళకు మహారాష్ట్రలోని పూణే జిల్లాకు చెందిన అమిత్ ఛబ్రాతో వివాహమైంది. వీరికి 12 ఏళ్ల కూతురు ఉంది. పెళ్లైన కొంతకాలం వరకు బాగానే ఉన్న అమిత్, రాను.. రాను.. చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. కహ్ర్చులు పెరిగాయి. అందుకు వచ్చే జీతం సరిపోకపోవడంతో.. జీతం పెంచాల్సిందిగా బాస్ కు విన్నవించుకున్నాడు. అందుకు అతడు అంగీకరించకపోగా, పక్కకు భార్యను పంపితే చూస్తా అన్నట్లుగా సమాధానమిచ్చాడు. ఆనాటి నుండి అమిత్ అరాచకాలు శృతిమించిపోయాయి. ప్రమోషన్ కోసం బాస్‌తో పడుకోవాలని భార్యను బలవంతం చేసేవాడు. ఇంట్లో ఉన్నంత సేపు అందుకు ఒప్పుకోవాలంటూ కాల్చుకు తినేవాడు.
పోనీ, అత్తమామలకు చెపుదామన్నా అది సాధ్యపడలేదు. అత్త భర్త చెప్పినట్లు చేయమని చెప్పేది. అమిత్ సోదరుడు సైతం ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, లైంగికంగా వేధించడం చేసేవాడు. ప్రతిఘటించిన ఆమెను దారుణంగా కొట్టేవాడు. విసిగిపోయిన ఆ మహిళ చేతి నరాన్ని కోసుకొని ఆత్మహత్యకు కూడా యత్నించింది. అయినప్పటికీ వారి వేధింపులు తగ్గలేదు. దీంతో ఆమె గతేడాది ఆగస్ట్‌లో ఇండోర్‌లోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. కొన్ని రోజుల అనంతరం.. తనకు జరిగిన వేధింపులను తల్లికి చెప్పుకొని భోరున విలపించింది. చివరకు తల్లి అండతోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇండోర్ పోలీసులు అతడిని పిలిపించి, విచారణ చేపట్టారు.
ఇకపై తన భార్యను వేధించనంటూ అమిత్ లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో.. తిరిగి ఆమె భర్త ఇంటికి వెళ్లింది. కొంత కాలం తర్వాత మళ్లీ వేధింపులుమొదలయ్యాయి. భర్త ఇంట్లో ఉన్నప్పుడే వేపుకు తింటే, మరిది ఆమె ఒంటిరిగా ఉన్నప్పుడు, స్నానానికి వెళ్ళినప్పుడు సైతం వేధించేవాడు. వీటిని భరించలేకపోయిన ఆమె, 12 కూతురు ముందే ఇలా చేస్తున్నారంటూ తల్లిదండ్రులకు తెలిపింది. వారు ఇండోర్ కోర్టును ఆశ్రయించగా, మహిళా సంక్షేమ అధికారిణితో దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. ఆ దర్యాప్తులో మహిళపై వేధింపులు నిజమేనని తేలడంతో.. ఆమె భర్త, అతడి సోదరుడు, అత్తపై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#Pune man forces wife to sleep with boss for quick promotion and perks; court admits victim’s complaint.https://t.co/QiQpVGHtw5
— TIMES NOW (@TimesNow) March 1, 2023