పుణెలోని భీమా నది ఒడ్డున ఏడు శవాలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని పుణె జిల్లా, పర్‌గావ్ గ్రామంలోని భీమా నది తీరంలోకి ఈ ఏడు శవాలు కొట్టుకువచ్చాయి. 18వ తేదీన ఒకటి.. తర్వాత 20నుంచి 22వ తేదీ మధ్య కాలంలో మిగిలిన శవాలు ఒడ్డుకు వచ్చాయి. వాటిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయా తేదీల్లో ఏడు శవాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి పంపారు. చనిపోయిన వారు ఒకే కుటుంబానికి చెందిన వారని గుర్తించారు.
వారు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావించారు. అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు మొదట భావించినట్లు అవి సామూహిక ఆత్మహత్యలు కాదని.. దారుణమైన హత్యలని తేలింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఉత్తమ్ పవార్(40), సంగీత(40), వారి అల్లుడు పండిత్ ఫులవేర్(28), కూతురు రాణి ఫులవేర్(24), వారి పిల్లలు రితేష్(7), చోటు(5), కృష్ణ(3)లు అహ్మద్ నగర్, నిఘోజ్ గ్రామంలో నివాసం ఉంటున్నారు. పవార్, సంగీత, పండిత్, రాణిలు కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు.
వీరి బంధువులైన నలుగురు వ్యక్తులు ఉత్తమ్ కుటుంబంపై పగ బట్టారు. ఈ పగకు గల కారణాలు తెలియరాలేదు. పగ తారాస్థాయికి చేరటంతో ఏడుగురిని చంపాలని నిందితులు నిశ్చయించుకున్నారు. తినే భోజనంలో మత్తు మందు కలిపి 7 ఏడుగురికి తినిపించారు నిందితులు. దీంతో ఆ ఏడుగురు స్ప్రహ కోల్పోయారు. స్ప్రహ కోల్పోయిన వీరిని నది దగ్గరకు తీసుకువచ్చారు. పసి వాళ్లని కూడా వదల్లేదు. అందరినీ నదిలో పడేశారు. దీంతో వారు నీటిలో పడి ఊపిరాడక చనిపోయారు. పోలీసులు 6 గురు మగవారితో పాటు, ఓ మహిళను అరెస్ట్ చేశారు. వారినుంచి సమాచారాన్ని రాబడుతున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.