ఆమెకు పెళ్లైంది. గత 27 రోజుల కిందటే ఓ కూతురు కూడా జన్మించింది. కూతురు పుట్టిందని సంతోషపడింది. అలా ఆమె కాపురం బాగానే సాగుతూ వచ్చింది. కట్ చేస్తే.. అదే మహిళ తాజాగా తన కూతురుని బీచ్ లోని ఇసుకలో పాతిపెట్టి దారుణంగా హత్య చేసింది. అసలేం జరిగిందంటే?
కన్న బిడ్డలకు చిన్న గాయం తగిలినా ఆ తల్లి తల్లడిల్లిపోతుంది. ఇక పస్తులుండైనా సరే తన పిల్లలకు కడుపు నిండా పెడుతుంది. కానీ, ఓ తల్లి మాత్రం.. నెల రోజులు కూడా లేని ఓ పసికందుపై కిరాతక తల్లి ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తల్లి ఏం చేసింది? అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. పుదుచ్చేరి బాగూర్ కిరుమాంపాక్కం సమీపంలోని మూర్తికుప్పం ప్రాంతం. ఇక్కడే ఓ మహిళ భర్తతో పాటు నివాసం ఉంటుంది. అయితే ఈ మహిళకు 27 రోజుల కిందట ఓ బిడ్డ జన్మించింది. పుట్టిన బిడ్డను చూసుకుంటూ ఆ తల్లి బాగానే ఉండేది. కానీ, గతంలోనే ఆ మహిళకు మద్యం, డ్రగ్స్ వంటివి అలవాటు ఉండేది. కూతురు పుట్టిందన్న సోయి కూడా లేకుండా ఆ మహిళ తన అలవాటును మానలేకపోయింది. ఇక శనివారం కూడా ఆ మహిళ డ్రగ్స్ సేవించింది. రాత్రిపూట కూతురు ఏడ్వడంతో డ్రగ్స్ మత్తులో ఉన్న ఆ మహిళకు ఏం చేయాలో తెలియక కూతురిని నేరుగా మూర్తికుప్పం బీచ్ కు తీసుకెళ్లింది.
అక్కడికి వెళ్లగానే ఆ మహిళ ఏడుస్తున్న కూతురుని ఇసుకలో పాతి పెట్టి దారుణంగా హత్య చేసింది. అనంతరం ఆ దుర్మార్గురాలు అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయింది. ఇక ఆదివారం ఉదయం స్థానికులకు ఇసుకలో చిన్నారి కాలు కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ పసికందు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టి ఎట్టకేలకు కూతురిని చంపిన అరెస్ట్ చేశారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. 27 రోజుల పసిబిడ్డను అతి దారుణంగా హత్య చేసిన కసాయి తల్లి కిరాతకంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.