కర్నూలు జిల్లాలో ఓ సైకో పట్టపగలు పోలీసులకు చుక్కలు చూపించాడు. కనిపించిన వాహనాల అద్దాలను ధ్వంసం చేస్తూ స్థానిక ప్రజలను భయాందోళనలకు గురి చేశాడు. అంతేకాకుండా నేరుగా పోలీస్ స్టేషన్ లోకి దూసుకెళ్లి..!
కర్నూలు జిల్లాలో ఓ సైకో పట్టపగలు వీరంగం సృష్టించాడు. చేతిలో ఓ రాడ్ పట్టుకుని కనిపించిన వాహనాల అద్దాలను పూర్తిగా ధ్వంసం చేశాడు. అంతేకాకుండా నేరుగా పోలీస్ స్టేషన్ లోకి దూసుకెళ్లి అందులో ఉన్న ఫర్నిచర్ ను అంతా నాశనం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా పత్తికొండ పోలీస్ స్టేషన్ ముందు ఓ సైకో హల్ చల్ చేశాడు. చేతిలో రాడ్ పట్టుకుని రోడ్డుపై ఉన్న రెండు కార్లు, బస్సు అద్దాలను పూర్తిగా ధ్వంసం చేశాడు. ఇక ఇతడిని చూసిన స్థానిక ప్రజలు భయంతో ఒక్కసారిగా పరుగులు తీశారు. అంతేకాకుండా ఆ సైకో నేరుగా పోలీస్ స్టేషన్ లోకి దూసుకెళ్లి అందులో ఉన్న ఫర్నిచర్ ను అంతా నాశనం చేశాడు.
దీంతో పోలీసులు అతడిని పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ఇక కొద్దిసేపు ఆ సైకో పోలీసులకు చుక్కలు చూపించాడు. ఇదంతా గమనించిన కొందరు స్థానికులు సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకున్నారు. ఇక మొత్తానికి పోలీసులు ఆ సైకోను అదుపులోకి తీసుకున్నారు. ఈ సైకో మైసూరుకు చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. హల్ చల్ చేసిన ఈ సైకో దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి. పట్టపగలు పోలీసులకు చుక్కలు చూపించిన ఈ సైకో దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.