Love Letter: కుమారుడు చేసిన పని కారణంగా ఓ పూజారి చావు దెబ్బలు తిన్నాడు. అతడితో పాటు గుడిని కూడా ఓ యువతి కుటుంబం ధ్వంసం చేసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, బడౌన్ జిల్లా, ఉప్రైలా గ్రామానికి చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఎల్లప్పుడూ ఆమెను ఫాలో అయ్యేవాడు. యువకుడి తండ్రి గ్రామంలోని జహర్‌వీర్ దేవ్ గుడిలో పూజారి. యువకుడు తరచుగా గుడికి వెళ్లే వాడు. కొద్దిరోజుల క్రితం యువతి గుడిలో ఉండగా ఆమెకు ప్రేమ లేఖ ఇచ్చాడు. తనకు ప్రేమ లేఖ ఇచ్చిన సంగతిని ఆమె తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు ఇనుప రాడ్లతో గుడి దగ్గరకు చేరుకున్నారు.
యువకుడి కోసం వెతికారు. అతడు కనిపించలేదు. దీంతో పూజారి అయిన అతడి తండ్రిని చితక్కొట్టారు. అంతటితో ఆగకుండా దేవాలయాన్ని కొంత ధ్వంసం చేశారు. అక్కడి విగ్రహాలను సైతం విరగ్గొట్టారు. పూజారి కుమారుడు గుడికి వెళ్లిన తన కూతుర్ని వేధిస్తున్నాడని, ఈ సారి ఏకంగా ప్రేమ లేఖ ఇచ్చాడని యువతి తల్లి తెలిపింది. తన కూతురు కాలేజ్‌కు పోయే సమయంలో కూడా అతడు వెంటపడుతుంటాడని వెల్లడించింది. అందుకే దాడి చేశామని తెలిపింది. అయితే, ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టుకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : కర్ణాటకలో దారుణం.. బాలికపై ఎనిమిది మంది అఘాయిత్యం.. వీడియోలు తీసి..!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.