అదృష్టం కలసి రాకపోతే అరటి పండు తిన్నా.. పన్ను ఉడుద్ది అంటారు. ఇలా లక్ కలసి రాకపోతే సరదాగా చేసే పనులు కూడా చిక్కులు తెచ్చి పెడుతాయి. తాజాగా హైదరాబాద్ లో కూడా ఇలాంటి ఓ విచిత్ర సంఘటన చోటుకి చేసుకుంది. ప్రాంక్స్ చేసే ఓ యూట్యూబర్.. హైదరాబాద్ లోని జగదీశ్ మార్కెట్ లో ఉండే ఓ మొబైల్ షాప్ లోకి వెళ్ళాడు. అక్కడ ముందుగా తాను అనుకున్న స్క్రిప్ట్ ప్రకారం షాప్ యజమానికి చిరాకు తెప్పించాడు.
అతనికి కావాలనే కోపం తెప్పించేలా బిహేవ్ చేశాడు. చివరికి ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఇంత వరకు అంతా ఆ యూట్యూబర్ అనుకున్నట్టే జరిగింది. కానీ.., ఇక్కడ నుండి యూట్యూబర్ అనుకున్న ప్రాంక్ వీడియో ఊహించని మలుపు తీసుకుంది. అప్పటికే ఆవేశాన్ని ఆపుకోలేక కంట్రోల్ తప్పిన యజమాని ఆ యూట్యూబ్ యాంకర్ ని చావకొట్టాడు.
కొట్టొద్దు బాబోయ్.., ఇది ప్రాంక్ అంటూ బతిమిలాడినా వదలలేదు. ప్రాంక్ అయితే.., ఇలా ప్రవర్తిస్తావా? ఇంకాస్త ఎక్కువ కొట్టేశాడు. ఇక విషయం తెలుసుకున్న అబిడ్స్ పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరి.. ఈ విషయంలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.