భార్యాభర్తలు అన్నాక గొడవలు పడడం సహజం. కానీ, ఇంతదానికే కొందరు దంపతులు క్షణికావేశంలో హత్యలు, ఆత్మహత్యలతో ప్రాణాలు తీసుకుంటున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ వ్యక్తి.. భార్యను కొట్టి చంపాడు. అంతేకాకుండా మరో దారుణానికి పాల్పడ్డాడు. అసలేం జరిగిందంటే?
పైన ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు పూర్ణిమ. గతంలో ఓ వ్యక్తితో ఈమెకు వివాహం జరిగింది. పెళ్లైన కొన్నేళ్ల పాటు ఈ దంపతుల వైవాహిక జీవితం బాగానే సాగుతూ వచ్చింది. కట్ చేస్తే ఇటీవల రాత్రి భార్యాభర్తలు గొడవ పడ్డారు. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో క్షణికావేశంలో ఊగిపోయిన ఆమె భర్త.. చపాతి కర్రతో భార్యను తలపై కొట్టి చంపాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
అది ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలులోని విరాట్ నగర్ ప్రాంతం. ఇక్కడే ఢాకా అంజిరెడ్డి-పూర్ణిమ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ భార్యాభర్తలు బాగానే సంసారం చేశారు. కానీ, రాను రాను దంపతుల మధ్య మనస్పర్థలు భగ్గుమన్నాయి. దీంతో తరుచు గొడవ పడుతుండేవారు. ఇదిలా ఉంటే సోమవారం రాత్రి ఈ భార్యాభర్తలు మరోసారి గొడవపడ్డారు. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఇక కోపంతో ఊగిపోయిన భర్త అంజిరెడ్డి ఇంట్లో ఉన్న చపాతి కర్రతో భార్య పూర్ణిమ తలపై బలంగా బాదాడు.
ఈ దాడిలో భార్య పూర్ణిమ రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. భార్య చనిపోయిందని తెలుసుకున్న అంజిరెడ్డికి ఆ సమయంలో ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. ఇక చేసేదేం లేక అదే రాత్రి కొత్తపట్నం వద్ద సముద్రంలోకి దూకి అంజిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అంజిరెడ్డి మృతదేహం సముద్రం ఒడ్డుకు రావడంతో స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంజిరెడ్డి మృతదేహంతో అతని భార్య పూర్ణిమ మృతదేహాన్ని సైతం పోస్ట్ మార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్ కు తరలించారు. అనంతరం ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. క్షణికావేశంలో భార్యను చంపి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్న ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) March 28, 2023