ఆమె పేరు ఉమారాజేశ్వరి. ప్రకాశం జిల్లాకు చెందిన ఈమెకు ప్రొద్దుటూరుకు చెందిన మణికంఠం అనే వ్యక్తితో గతంలో వివాహం జరిగింది. అయితే పెళ్లైన కొంతకాలం పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. కానీ పెళ్లై ఏడాది అవుతున్నా ఇంకా ఆమెకు పిల్లలు కలగలేదు. ఈ కారణంతోనే అత్తింటి వాళ్లు ఉమారాజేశ్వరిని మానసిక హింసకు గురి చేయడంతో పాటు పిల్లలు కలగడానికి నాటు మందు తాగించారు. దీనిని తాగిన ఆమె తీవ్ర అస్వస్థతకు గురై కొంత కాలం తర్వాత మరణించింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ఇడమకల్లు. ఇదే గ్రామానికి చెందిన గోపవరం బ్రహ్మయ్య ఉమామహేశ్వరి అనే కూతురు ఉంది. ఇక పెళ్లి చేయాలని భావించిన ఆ యువతి తల్లిదండ్రులు ప్రొద్దుటూరుకు చెందిన మణికంఠం అనే వ్యక్తితో గతంలో వివాహం జరిపించారు. ఇక పెళ్లైన కొంతకాలం పాటు ఈ భార్యాభర్తలు ఎలాంటి గొడవలు లేకుండా జీవించారు. కానీ పెళ్లై ఏడాది కావస్తున్న ఆమెకు ఇంకా పిల్లలు కలగలేదు. దీంతో కోడలిని మణికంఠం తల్లిండ్రులు వేధించడం మొదలు పెట్టారు. కోడలికి పిల్లలు కలగకుంటే సమాజం సూటి పోటి మాటలతో వేధిస్తుందని అత్తింటి వారు భావించారు.
దీంతో కోడలికి పిల్లలు కలగాలని భావించిన అత్తమామలు కోడలికి నాటు మందు తాగమని ఇచ్చారు. అది తాగిన ఉమామహేశ్వరి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈ విషయం తెలుసుకున్న ఉమామహేశ్వరి తల్లిదండ్రులు తమ కూతురిని ఇంటికి తీసుకెళ్ళి ఆస్పత్రిలో చేర్పించారు. ఇక ఆమె ఆరోగ్యం కాస్త కుదుటపడిందో లేదో అప్పుడే అత్తింటి వాళ్లు వచ్చి మణికంఠం తమ్ముడిది పెళ్లి ఉందని చెప్పి కోడలని తీసుకెళ్లారు. అనంతరం అక్కడికి వెళ్లాక సూటి పోటి మాటలతో ఆమెను వేధించడం మొదలు పెట్టారు. ఇదే కాకుండా ఆమె వద్దనున్న 16 తులాల బంగారు అభరణాలు సైతం తీసుకుని మళ్లీ ఆమెను పుట్టింట్లో వదిలి వెళ్లారు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు పుట్టింట్లో ఉన్న ఉమామహేశ్వరి ఉన్నట్టుండి మరణించింది. కూతురు మరణించడంతో ఆమె తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. అనంతరం ఉమామహేశ్వరి తల్లిదండ్రులు కూతురు మరణంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.