Haryana: హర్యానాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోయింది. ఓ పోలీస్ ఉన్నతాధికారిపై దారుణానికి పాల్పడింది. రాళ్ల లారీలను అడ్డుకున్నాడన్న కోపంతో అదే లారీలతో అతడి ప్రాణాలు తీసింది. ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హర్యానాలోని ఛంఢీఘర్‌కు చెందిన సురేంద్ర సింగ్ బిషోనీ డీఎస్‌పీ ర్యాంకు పోలీస్ అధికారి. పంచ్‌గావ్‌లో ఆరావళి పర్వతాలనుంచి అక్రమంగా రాళ్లను తరలిస్తున్నారని మంగళవారం అతడికి సమాచారం అందింది.
దీంతో అతడు తన టీంతో కలిసి ఉదయం 11గంటల సమయంలో అక్కడికి వెళ్లాడు. పోలీసులను చూడగానే దొంగలు తమ లారీలతో అక్కడినుంచి పారిపోవటం మొదలుపెట్టారు. దీంతో లోడు చేసిన రాళ్లతో వెళుతున్న ఓ లారీకి అడ్డుగా సురేంద్ర సింగ్ నిలబడ్డాడు. తను అడ్డంగా ఉంటే లారీ ఆపేస్తారని అనుకున్నాడు. అయితే, అలా జరగలేదు. లారీ డ్రైవర్.. సురేంద్రపై నుంచి లారీని పోనించాడు.
దీంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. ఆ వెంటనే ఆ లారీతో పాటు మిగిలిన లారీలు కూడా అక్కడినుంచి వెళ్లిపోయాయి. సురేంద్ర మరణ వార్తతో జిల్లాలో కలకలం రేగింది. ఎస్పీ వరుణ్ సింగ్లా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : కొడుకు మృతదేహాన్ని ముద్దాడుతూ కన్నుమూసిన తల్లి! ఈ స్టోరీ వింటే గుండె తరుక్కుపోతోంది!