హైదరాబాద్ నడిబోడ్డున కొందరు నిర్వాహకులు వ్యభిచారాన్ని నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి 20 మంది యువతులను రప్పించుకుని ఈ పాడు పనికి శ్రీకారం చుట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ వ్యభిచార గృహంపై దాడులు నిర్వహించి ఆ 20 మంది యువతులను రక్షించి కొంతమందిని అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ లో వ్యభిచారం గుట్టు రట్టు అయింది. సీక్రెట్ గా కొనసాగిస్తున్న ఈ పాడు పనిపై పోలీసులు ఫోకస్ పెట్టి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏకంగా 20 మంది యువతులను అదుపులోకి తీసుకుని కొందరిని అరెస్ట్ చేశారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన సంచలనంగా మారుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ నడిబోడ్డులోని పంజాగుట్ట రోడ్ నెంబర్ 7లోని నవీన్ నగర్ లో అక్షయ్ కుమారు అనే వ్యక్తి స్పా ముసుగులో వ్యభిచారాన్ని నిర్వాహిస్తున్నారు. ఈ వ్యవహారం గత కొంత కాలం నుంచి కొనసాగుతుందని సమాచారం. ఇతర రాష్ట్రాల నుంచి ఏకంగా 20 మంది యువతులను తీసుకొచ్చి ఇక్కడ ఇలాంటి పాడు పనులకు శ్రీకారం చుట్టారు.
అయితే సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు సోమవారం రాత్రి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 7లో ఉన్న ఆ స్పా సెంటర్ పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నిర్వాహకుడు అక్షయ్, సబ్ ఆర్గనైజర్ శృతితో మరో ముగ్గురు ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా కొంతమంది విటులను కూడా అదుపులోకి తీసుకుని ఏకంగా 20 మంది యువతులను కాపాడారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పంజాగుట్ట పోలీసులు తెలిపారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన సంచలనంగా మారుతోంది.