కుక్కల్లో పోలీస్ కుక్కలకు ఉన్న ప్రత్యేకత ఇంకే కుక్కలకు ఉండదు. ఎందుకంటే ఇవి పోలీస్ పని కోసం ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వబడతాయి. వీటిని ఎంతో క్రమ శిక్షణతో పెంచుతారు. ఎలాంటి ఆపద సమయంలో కూడా ఈ కుక్కలు వీరోచితంగా పోరాడుతాయి. అలాంటి ఓ కుక్క తప్పుడు పని చేస్తే పరిస్థితి ఏంటి?. పోలీసులు దానిపై చర్యలు తీసుకుంటారా? లేదా? అంటే కచ్చితంగా తీసుకుంటారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే ఆమెరికాలో జరిగిన ఈ సంఘటన. అమెరికాలోని మిచిగాన్‌కు చెందిన ఐస్ అనే కుక్క వేండట్టి పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తోంది. కొద్దిరోజుల క్రితం ఈ కుక్క ఓ ఆఫీసర్ లంచ్ బాక్సును తినేసింది. దీంతో పోలీసులు ఆ కుక్కపై కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం ఆ కుక్క దర్యాప్తు ఎదుర్కొంటోంది. దీనిపై వేండట్టి పోలీస్ డిపార్ట్‌మెంట్ ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్టులో.. ‘‘ దొంగతనం చేయటం నేరం మాత్రమే కాదు. నిజాయితీ పరంగా అదో పెద్ద తప్పు. ఓ పోలీస్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టే ముందు నిజాయితీగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తాం. అలా చేసినపుడు పక్కవాడి ఆస్తిని కాపాడాలి. ఈ విషయం చెప్పటానికి చింతిస్తున్నాం.. వేండట్టి పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని ఓ ఆఫీసర్ దొంగతనం చేశాడు. ఈ సంఘటన రెండు రోజుల క్రితం చోటుచేసుకుంది. బార్వింగ్ అనే ఓ ఆఫీసర్ భోజనం చేస్తూ ఉన్నాడు.
ఇంతలో మరో ఆఫీసర్ ఆయన్ని పిలిచాడు. దీంతో బార్వింగ్ అక్కడినుంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి వచ్చాడు. ఆఫీసర్ ఐస్(పోలీస్ కుక్క) అతడి భోజనాన్ని మొత్తం తినేసింది. అతడిపై ఇదివరకే చాలా ఆరోపణలు ఉన్నాయి. అందుకే అతడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాము’’ అని పేర్కొంది. ప్రస్తుతం ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేల సంఖ్యలో వ్యూస్ లైక్స్‌తో దూసుకుపోతోంది. నెటిజన్లు దీనిపై స్పందిస్తూ.. ‘‘ కుక్క.. కుక్క బుద్ధి చూపించింది’’.. ఆ కుక్క పోలీస్ ఉండటానికి పనికి రాదు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.