ఆ పోలీస్ కానిస్టేబుల్ తన స్కూటీపై బాలిక వెంట పడుతూ ఉన్నాడు. బాలికను మాటలతో వేధిస్తూ ఉన్నాడు. ఇది గమనించిన ఓ మహిళ తన స్కూటీతో అక్కడికి వచ్చింది.
ప్రజలను రక్షించాల్సిన పోలీసులే కొన్ని సార్లు బరితెగిస్తున్నారు. ప్రజల్ని సరైన దోవలో పెట్టాల్సిన వారే తప్పులు చేస్తున్నారు. తాజాగా, ఓ పోలీస్ పట్ట పగలు నడిరోడ్డుపై బరితెగించాడు. సైకిల్ మీద స్కూలుకు వెళుతున్న బాలిక వెంటపడి వేధింపులకు గురి చేశాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లోని లక్నోలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, లక్నోకు చెందిన షెహదత్ అలీ అక్కడి ఓ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం అతడు తన స్కూటీపై రోడ్డు మీదకు వచ్చాడు.
ఆ స్కూటీకి నెంబర్ ప్లేటు కూడా లేదు. రోడ్డుపైకి రాగానే సైకిల్‌పై వెళుతున్న ఓ బాలికను స్కూటీతో ఫాలో అవ్వసాగాడు. ఆ బాలికను వేధిస్తూ ఉన్నాడు. ఆ బాలిక ఇబ్బందిపడుతున్నా వదల్లేదు. అదే రోడ్డుపై వెళుతున్న ఓ మహిళ, మరో వ్యక్తి.. ఆ పోలీస్ బాలికను వేధించటాన్ని గుర్తించారు. వెనకాల ఉన్న వ్యక్తి తన సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తూ ఉండగా.. ఆ మహిళ స్కూటీని పోలీస్ దగ్గరకు పోనిచ్చింది. బాలికను ఎందుకు వేధిస్తున్నావ్ అంటూ ఆ పోలీస్‌ను నిలదీసింది. దీంతో షెహదత్ రెచ్చిపోయాడు.
అయినా ఆ మహిళ వెనక్కు తగ్గలేదు. కొద్దిసేపటి తర్వాత మరికొంతమంది అక్కడ గుమిగూడారు. ఈ నేపథ్యంలోనే అతడు ఆ బాలికను ప్రతి రోజూ వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో కాస్తా పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. బాలికను వేధించిన అతడిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు చెప్పారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#lucknow: स्कूली छात्राओं से छेड़छाड़ करता वर्दीधारी, वर्दीधारी का नाम बताया जा रहा शहादत अली, खाकी की शर्मनाक हरकत से पुलिस विभाग हो रहा बदनाम,छात्रा को हर दिन फॉलो करने का आरोप, महिला ने सिपाही की करतूत का वीडियो बनाकर किया वायरल,कैंट क्षेत्र का बताया जा रहा वीडियो।@lkopolice pic.twitter.com/Oy8WUV75WS
— TV9 Uttar Pradesh (@TV9UttarPradesh) May 3, 2023