నానాటికి సమాజంలో పాపపు పనులు ఎక్కువైపోతున్నాయి. స్త్రీ, పురుషుల అక్రమ సంబంధాలు ఎక్కువయ్యాయి. సంపాదన కోసం కొందరు, శారీరక సుఖం కోసం మరికొందరు వ్యభిచారాలు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లోని లాడ్జీల్లో, అపార్ట్ మెంట్ లో ఇళ్లు అద్దెకు తీసుకుని వ్యభిచారాలు నిర్విహిస్తుంటారు. ఇప్పుడు ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే దేవస్థానం ప్రాంతంలో ఉండే అద్దె గదుల్లో అసాంఘీక పనులు చేస్తున్నారు. కొందరు దేవస్థానంలోని అద్దె గదుల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ సంఘటన కరీనంగర్ జిల్లాలోని కొండగట్టు వీరాంజనేయ స్వామి దేవస్థానం పరిధిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. శ్రీ కొండగట్టు వీరాంజనేయస్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాముఖ్యత పొందిన పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ స్వామి వారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. అలాంటి పవిత్రమైన క్షేత్రం పరిధిలో కొందరు వ్యభిచారం నిర్వహిస్తున్నారు. మల్యాల పోలీసులకు అందిన సమాచారం మేరకు.. కొండగట్టుకు దిగువున ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థాన అద్దె గదుల్లో మంగళవారం పోలీసువారు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో ఓ గదిలో వ్యభిచారం నిర్వహిస్తూ ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి రూ.15 వేలు స్వాధీనం చేసుకున్నామని ఎస్సై పేర్కొన్నారు. బాధిత మహిళ కాకుండా గదుల నిర్వాహకుడు కిరణ్‌కుమార్ తో పాటు మిగతా ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. దేవస్థాన పరిధిలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగటంపై స్థానికులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇలాంటి పనులను చేసిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరారు. ఆలయ పరిధిలో జరుగుతున్న ఇలాంటి ఘోరాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.