Young Women Gang: ఆన్‌లైన్‌లో హనీ ట్రాపుల పేరుతో అమ్మాయిలు మోసం చేయటం చూస్తూనే ఉన్నాం. అందంతో ఎర వేసి, అందినకాడికి దోచుకోవటం ఆన్‌లైన్ హనీ ట్రాపుల పని. ఇదంతా అవతలి వ్యక్తి మనకు అందుబాటులో లేకుండా జరిగిపోతుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఓ కొత్త రకం హనీట్రాప్ నడుస్తోంది. ఉత్తరాదికి చెందిన కొంతమంది అమ్మాయిలు గ్యాంగులుగా ఏర్పడి, మోడ్రన్ డ్రెస్సులతో మోసాలకు పాల్పడుతున్నారు. రోడ్లపైకి ఎక్కి, వాహనదారులను అందినకాడికి దోచుకుంటున్నారు. గుంటూరు జిల్లాలో ఇలాంటి ఓ గ్యాంగును పోలీసులు అరెస్ట్ చేశారు.
పెదకాకాని పరిధిలోని ఇన్నర్ రింగ్‌రోడ్‌ను స్థావరంగా చేసుకుని సదరు అమ్మాయిలు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తేల్చారు. ఈ అమ్మాయిలు మోడ్రన్ డ్రెస్సుల్లో వాహనదారులను ఆకర్షించి, డొనేషన్ల పేరిట సాంతం దోచేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా వారిని పట్టుకున్నారు. ఇలాంటి మోసాలు ఎక్కడెక్కడ చేశారో విచారిస్తున్నారు. మరి, ఈ కిలేడీల మోసాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Ameerpet Metro: మెట్రో లిఫ్ట్‌లో యువకుడి దారుణం.. యువతి ముందే బట్టలు విప్పి..