జంషీద్ గ్యాంగ్.. కర్ణాటకలో పేరుమోసిన గ్యాంగ్ ముఠా ఇది. ఎన్నో నేరాలు, మరెన్నో దారుణాలకు పాల్పడుతూ అమాయకులను మోసం చేస్తున్నారు. ఈ గ్యాంగ్ ముఠాపై కర్ణాటకలో 45 కేసులకు పైగా నమోదైనట్లు తెలుస్తుంది. అయితే ఇటీవల నకిలీ కరెన్సీలో కేసులో భాగంగా జంషీద్ గ్యాంగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే పోలీసుల విచారణలో భాగంగా జంషీద్ గ్యాంగ్ నేరాలు మరిన్ని వెలుగులోకి వచ్చాయి. తాజాగా వెలుగు చూసిన ఈ నేరాలను చూసి పోలీసులు ఖంగుతిన్నారు. జంషీద్ గ్యాంగ్ చేసిన అరాచకాలు ఏంటి? అసలు వీళ్లు ఎవరనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.
కర్ణాటక కేంద్రంగా గుట్టుచప్పుడు కాకుండా జంషీద్ గ్యాంగ్ గత కొంత కాలం నుంచి ఎన్నో దారుణాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. గంజాయి, అక్రమ ఆయుధాల తయారీ, కిడ్నాప్ వంటివి వాటిలో ఈ గ్యాంగ్ ఆరితేరింది. ఇక ఇదే కాకుండా మరెన్నో దారుణాలు పాల్పడుతూ కర్ణాటక కేంద్రంగా గుట్టు చప్పుడు కాకుండా ఈ గ్యాంగ్ అరాచకాలకు పాల్పడినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇటీవల బళ్లారి ప్రాంతంలో నకిలీ కరెన్సీ తయారీ దందా నడుస్తుందనే సమాచారంతో పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యారు. దీంతో అనంతరంలో కొందరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా జంషీద్ గ్యాంగ్ అరాచకం వెలుగులోకి వచ్చింది.
దీంతో పోలీసులు వెంటనే జంషీద్ తో పాటు మరికొంత మంది నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇక పోలీసుల విచారణలో భాగంగా గ్యాంగ్ సెల్ ఫోన్ లను పరిశీలించగా మరిన్ని అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. కొందరు వ్యక్తులను కిడ్నాప్ చేసి ఆ తర్వాత వారిపై విచక్షణారకహితంగా దాడి చేస్తున్న వీడియోలు సైతం వారి ఫోన్ లలో దొరికాయి. ఇక ఇదే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఆయుధాలను తీసుకొచ్చి బెంగుళూరు నగరంలో సరఫరా చేస్తున్నట్లు కూడా సమచారం. అయితే ఈ గ్యాంగ్ పై కర్ణాటకలో ఇప్పటికే 45 కేసులకు పైగా నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. ఇక వీటన్నిటినీ పరిశీలించిన పోలీసులు ఈ జంషీద్ గ్యాంగ్ మూలాలు ఎక్కడున్నాయనే కోణంలో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఈ గ్యాంగ్ లో జంషీద్ తో పాటు తన అనుచరులను పోలీసలు అరెస్ట్ చేసి వారి నుంచి 18 తుపాకులతో పాటు మరిన్ని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన జంషీద్ గ్యాంగ్ స్థానికంగా తీవ్ర కలకంగా మారుతోంది.