స్పా, మసాజ్ సెంటర్ల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాలను చాలానే చూశారు. అలాంటి వాటిపై దాడులు చేసి పోలీసులు వారిని అరెస్టు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ, ఇంకా ఆ దందా ఆగినట్లు కనిపించడం లేదు. తాజాగా హైదరాబాద్‌లో మరోసారి స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. పక్కా సమాచారంతో దాడి చేసి మొత్తం 10 మందిని అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళితే.. భీమ్ సింగ్ అనే వ్యక్తి ఆర్ట్ స్పా పేరిట వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. ఈ స్పా మూసాపేట సమీపంలోని భవానీనగర్‌లో ఉంది. అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నారని పక్కాగా సమాచారం అందుకుని ఒక్కసారిగా పోలీసులు దాడి చేశారు. పోలీసులు అనుమానం నిజమైంది. అక్కడ స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. నిర్వాహకుడు భీమ్ సింగ్ సహా అతని అసిస్టెంట్లు ఇద్దరు, ఆరుగురు కోల్‌కత్తాకు చెందిన యువతులు, ఒక విటుడుని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన పది మందిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.