క్షణికావేశంలో కట్టుకున్న భర్త చేసిన దారుణానికి ఓ భార్య నిండు ప్రాణం గాలిలో కలిసి పోయింది. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సంజయ్ గాంధీ నగర్ ప్రాంతం. ఓదెల గ్రామానికి చెందిన సూత్రాల రక్షిత 6 సంవత్సరాల క్రితం సుందరగిరి రాజేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వీరి పెళ్లికి రక్షిత తల్లిదండ్రులు నాలుగు తులాల బంగారం కానుకగా ఇచ్చారు.
అయితే సొంత అవసరాల కారణంగా భార్యకు తెలియకుండా భర్త బంగారాన్ని తాకట్టు పెట్టాడు. అయితే ఇదే విషయమై భార్యాభర్తల మధ్య రోజు గొడవలు జరిగేవి. దీంతో ఇటీవల భార్య రక్షిత భర్తను మరోసారి బంగారం విషయంపై నిలదీసే ప్రయత్నం చేసింది. దీంతో కోపంతో ఊగిపోయిన భర్త క్షణికావేశంలో ఇంట్లో ఉన్న టెస్టర్ తో భార్య రక్షితను దారుణంగా పొడిచి చంపాడు.
ఇది కూడా చదవండి: ఆస్పత్రిలో పాడుపని.. అందరి ముందే యువతిపై కోరిక తీర్చుకున్న కామాంధుడు!
ఏం జరిగిందని తెలుసుకునే లోపే రక్తపుమడుగులో పడి ఆ మహిళ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.