ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు అధిక శాతం నేరాలకు కారణమవుతున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. పెద్దల సాక్షిగా ఒక్కటైన జంట కొంత కాలం కాపురం చేసిన తర్వాత కలహాలు రావడం.. ముఖ్యంగా వివాహేతర సంబంధాల వల్ల ఒకరిని ఒకరు చంపుకునే స్థాయికి వెళ్తున్నారు. భర్త, ఇద్దరు పిల్లలున్న ఓ మహిళ, మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది.. తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని పలుమార్లు భర్తని హత్యచేయడానికి ప్రయత్నించి చివరికి తుపాకీతో కాల్చి చంపింది. ఈ దారుణ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగిందీ దారుణం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేటకు చెందిన రవళికి కొరకొప్పుల రాజేందర్ (28)తో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. అప్పటికే రవళికి మరో వ్యక్తి తో సంబంధం ఉంది. ఈ విషయం తెలుసుకున్న రాజేందర్ ఆమెను నిలదీశాడు. దీంతో రవళి భర్తను దూరంగా పెట్టడం మొదలు పెట్టింది. తర్వాత తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఇటీవల పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. ఇక ముందు ఏ తప్పు చేయనని ఒప్పుకొని భర్తతో వచ్చింది రవళి.
రాజేందర్ తల్లిదండ్రులతో రవళి గొడవ పెట్టుకోవడం మొదలు పెట్టింది. దీంతో పక్క ఊళ్లో కాపురం పెట్టారు. ఈ మద్యనే రాజేందర్ కి తన తండ్రి ఉద్యోగం రావడంతో శ్రీరాంపూర్‌లో పనిచేస్తున్నాడు. అప్పటి నుంచి భర్తను అడ్డు తొలగించే ప్రయత్నాలు మొదలు పెట్టింది రవళి. శనివారం తెల్లవారుజామున ఇద్దరు వ్యక్తులు వచ్చి రాజేందర్ ని కాల్చి చంపారు.
తుపాకీ శబ్ధం రావడంతో చుట్టు పక్కల వాళ్లు రాజేందర్ ఇంటికి వచ్చి చూడగానే రక్తపు మడుగులో ఉన్నాడు. తాను బాత్ రూమ్ కి వెళ్లి వచ్చేవరకు ఎవరో తన భర్తను చంపి వెళ్లిపోయారిన కట్టు కథలు అల్లింది రవళి. కానీ ఆమెపై అత్తమామలకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు తమదైన స్టైల్లో ప్రశ్నించారు. దీంతో అసలు విషయం బయటపెట్టింది. గతంలో ఇంటిగేటుకు విద్యుత్ వైరు తగిలించి, కారుతో ఢీకొట్టించి చంపే ప్రయత్నం చేసినట్లు పోలీసులు ముందు ఒప్పుకుంది.
ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులతోపాటు రవళిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బందం రాజు, సయ్యద్‌తో కలిసి రవళి తమ కుమారుడిని హత్య చేయించినట్టు రాజేందర్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. గన్ బీహార్ నుంచి కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.