పెద్దపల్లి జిల్లాలో భార్యాభర్తల మధ్య వివాదం చినిగి చినిగి చంపుకునే స్థాయికి చేరుకుంది. జిల్లాలోని కాసిపేట మండలం ఉప్పట్ల గ్రామానికి చెందిన రేణుకను ఇదే గ్రామంలో ఓ వ్యక్తికి ఇచ్చి గతంలో వివాహం జరిపించారు. కొన్నేళ్ల పాటు సంతోషంగా సాగిన వీరి కాపురంలో ఈ మధ్యకాలం నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తాయి. ఇక వీరిద్దరి మధ్య వివాదం రాను రాను తీవ్ర రూపం దాల్చింది. కుటుంబ సభ్యులు చాలా సార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కొన్నళ్లికి మళ్లీ అదేదారిలోకి వెళ్లారు.
వీరిద్దరి పంచాయితీ తెగదని వారి కుటింభికులు గ్రామంలోని పెద్దల సమక్షంలో పంచాయితీని ఏర్పాటు చేశారు. అయితే భార్యాభర్తలకు సర్దిచెప్పేందుకు గ్రామస్తులు అనేక ప్రయత్నాలు చేశారు. భార్య మాత్రం నేను నా భర్తతో ఉండలేనంటూ పెద్దల ముందే తెగేసి చెప్పింది. ఇక గ్రామస్తుల ముందే భార్య నీతో కాపురం చేయనని చెప్పడంతో భర్త ఆవేశం కట్టలు తెంచుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన భర్త పంచాయితీలోనే పక్కనున్న బండరాయితో భార్య రేణుక తలపై బలంగా బాదాడు.
విచక్షణ రహితంగా దాడి చేయడంతో భార్య రేణుక రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. దీంతో గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు భర్తపై కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టేశారు. భర్త తీసుకున్న తొందర పాటు నిర్ణయానికి భార్య నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. క్షణికావేశంలో భర్త తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.