భర్తని కాదని కొందరు వివాహితలు వివాహేతర సంబంధాలకు కాలుదువ్వుతున్నారు. ఇక ఏకంగా భర్తను వదిలేసి ప్రియుడితో జతకట్టడంతో చివరికి హత్యలు లేదా ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా దాచేపల్లికి చెందిన ఫాతిమాకు గతంలో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక భర్తతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని అంబులెన్స్ డ్రైవర్ తులసీరామ్ తో పరిచయం ఏర్పడింది.
ఇది కూడా చదవండి: అన్నాచెల్లెళ్లు అనే మాటే మర్చిపోయారు.. అర్ధరాత్రి ఎవరులేని చోటుకు వెళ్లి!
ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధంగా దారి తీయడంతో ఆమెను సత్తెనపల్లిలోని ఓ అద్దె ఇంట్లో ఉంచి సహజీవనం చేస్తున్నాడు. ఇక సాఫీగా సాగుతున్న వీరి చీకటి కాపురంలో ఓ చిచ్చు ఏర్పడింది. ప్రియురాలు ఎవరితో తిరుగుతుందనే అనుమానం తులసీరామ్ కు ఏర్పడింది. దీంతో ఇద్దరికి గొడవలు జరిగేవి. ఇక ఈ క్రమంలోనే ఇదే విషయమై మరోసారి వాగ్వాదం జరగడంతో తులసీరామ్ క్షణికావేశంతో ప్రియురాలిని కత్తితో దాడి చేసి పరారయ్యాడు. వెంటనే స్పందించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.