Afghanistan: ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌కు శనివారం హెచ్చరికలు జారీ చేసింది. తమ దేశంపై పాకిస్తాన్ వైమానిక దాడులు చేయటం కారణంగా ఐదుగురు చిన్నారులతో పాటు ఓ మహిళ మృత్యువాత పడిందని ఆరోపించింది. హరిహద్దుల వెంబడి ఈ దాడులు జరిగాయని వెల్లడించింది. ఇలాంటి దాడుల్ని సహించేది లేదని స్పష్టం చేసింది. డైరెక్టర్ ఆఫ్ ఇన్‌ఫర్‌మేషన్ నజిబుల్లా హస్సన్ అబ్దుల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ కునార్‌లోని షెల్టన్ జిల్లాలో పాకిస్తాన్ రాకేట్ దాడులు జరిగాయి. పాకిస్తాన్ హెలికాఫ్టర్లు కోస్ట్ ప్రావిన్స్‌లోని నాలుగు గ్రామాలపై దాడులు చేశాయి.
గ్రామస్తుల ఇళ్లే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. కొంతమంది చనిపోయారు. ఈ దాడుల్ని ది ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ తీవ్రంగా ఖండిస్తోంది. ఇది చాలా దారుణం. ఇది రెండు దేశాల మధ్య శుత్రుత్వానికి దారి తీస్తుంది. ఇలాంటి దాడులు ఇకపై జరగకుండా ఉండేందుకు శాయశుక్తులా ప్రయత్నిస్తాం. రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే ఏం అవుతుందో పాకిస్తాన్‌కు తెలుసు. అది రెండు దేశాలకు మంచిది కాదు’’ అని అన్నారు.
పెరిగిన మృతుల సంఖ్య..
శుక్రవారం జరిగిన పాకిస్తాన్ హెలికాఫ్టర్ దాడుల కారణంగా ఆఫ్ఘనిస్తాన్‌లోని కోస్ట్ కునర్ ప్రావిన్స్‌లో దాదాపు 40 మంది మృత్యువాత పడ్డారని ఏఎన్‌ఐ తాజాగా వెల్లడించింది. ఆఫ్ఘనిస్తాన్ పౌరులే లక్ష్యంగా జరిగిన ఈ దాడుల్లో పిల్లలు కూడా చనిపోయారని తెలిపింది. మరి, ఈ దాడులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ఇంటి నుంచి వెళ్లిన తల్లీకూతుళ్లు.. అడవిలో కుళ్లిపోయిన శవాలుగా తేలారు !
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.