ఈ మధ్యకాలంలో యువతులపై దారుణంగా అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చట్టాలు తెచ్చినా ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం అవుతునే ఉన్నాయి. తాజాగా సొంత కూతురిపై ఏకంగా తండ్రి అత్యాచారం చేసిన ఘటన తమిళనాడు లో చోటు చేసుకుంది. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది తమిళనాడులోని విల్లుపురం జిల్లా కోవిల్‌పురాయూర్ గ్రామం. వెంకటేశ్ అనే దివ్యాంగుడికి పెళ్లై ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. అనారోగ్య కారణాల వల్ల తన భార్య మరణించటంతో కూతుళ్లతో పాటు వెంకటేష్ జీవనం సాగిస్తూ వస్తు ఉన్నాడు. అయితే ఈ మధ్య కాలంలోనే తన చిన్న కుమార్తెపై తండ్రి అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతో భయాందోళనకు గురైన బాలిక పక్క నున్న కత్తితో కన్న తండ్రిని దారుణంగా హత్య చేసింది.
దీంతో తండ్రి వెంకటేష్ రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఇక గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసుల విచారణ వేగవంతం చేశారు. చివరికి పోలీసుల విచారణలో తన తండ్రిని ఆత్మరక్షణ కోసం నేనే హత్యచేశానని చెప్పటంతో ఆ బాలికను అరెస్ట చేశారు పోలీసులు. ఇక ఆత్మరక్షణ కోసం కూతురు చేసిన ఈ దాడిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.