హైదరాబాద్ లో గత కొన్ని రోజుల నుంచి పోలీసుల దాడుల్లో రోజుకొక వ్యభిచార గుట్టు రట్టు అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల చంద్రాయణగుట్ట పరిధిలోని బార్కస్ ప్రాంతంలో నకిలీ బాబా వేశంలో రూమ్ ను అద్దెకు తీసుకుని వ్యభిచారం నడిపించాడు. ఓ సామాజిక కార్యకర్త సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడుని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో పోలీసులు ఎక్కువగా వ్యభిచారాన్ని నిర్వహించే యాదగిరిగుట్టలో పోలీసులు ఏక కాలంలో దాడులు నిర్వహిస్తూ అనుమానితుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే తాజాగా కంసాని అనుసూయ అనే మహిళ ఇద్దరు బాలికలతో వ్యభిచారాన్ని నిర్వహిస్తూ పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై పోలీసులు మరింత దూకుడుగా వ్యవహరించి దాడులు నిర్వహించడంతో మరిన్ని ఖంగుతినే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తెలంగాణలో ప్రసిద్ద దేవాలయంగా పేరు పొందింది యాదాద్రి ఆలయం. తెలంగాణ ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి అత్యాధునిక హంగులతో యాదాద్రి ఆలయాన్ని సరికొత్తగా ముస్తాబు చేసింది. దీంతో రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతుండడంతో వ్యభిచార ముఠా సభ్యులకు ఇది ఆసరాగా మారింది. ఈ క్రమంలోనే వ్యభిచార ముఠా సభ్యులు యాదగిరిగుట్ట పరిధిలో మళ్లీ గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు. కానీ ముఠా సభ్యులు ఈసారి కాస్త తెలివిగా అడుగులు వేసి సాంకేతికత ఉపయోగించుకుంటున్నారు. మొబైల్ ఫోన్ లోనే అమ్మాయిలను బుక్ చేసుకుంటే.. అమ్మాయిలు ఏకంగా విటుల రూమ్ వద్దకే వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు.
ఇలా గత కొన్ని రోజుల నుంచి ముఠా సభ్యులు వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై అలెర్ట్ అయిన పోలీసులు ముందుగా అనుమానితుల ఇళ్లలో దాడులు నిర్వహించారు. అయితే ఎలాంటి ఆధారాలు లభించకపోయినా.. వారి ప్లాన్ ను మాత్రం పోలీసులు పసిగట్టారు. ముందుగా విటులు వ్యభిచార నిర్వాహాకులను సంప్రదిస్తారు. వెంటనే ఆ నిర్వహాకులు అమ్మాయిల ఫొటోలను విటులకు వాట్సాప్ ద్వారా పంపిస్తారు. వారికి నచ్చితే రేటు ఫిక్స్ చేసుకుని నిర్వాహకులకు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా డబ్బులు పంపిస్తారు. ఇక డబ్బులు రాగానే ఆ నిర్వాహకులు విటుల ఇంటి ముంగటికే అమ్మాయిలను పంపిస్తున్నారని పోలీసులు తెలుసుకున్నారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు. వ్యభిచార నిర్వాహణకు ఇంత తెలివిగా సాంకేతికతను వాడుకుంటుండడంతో పోలీసుల ఆశ్చర్యపోతున్నారు.