అప్పట్లో సంచలనంగా మారిన ఆయేషా మీరా హత్య కేసు మరోసారి తెరపైకి వచ్చింది. మృతురాలి తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం విచారణ చేపట్టాలంటూ తాజాగా సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయేషా మీరా హత్య కేసు అప్పట్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఇదే కేసు మరోసారి తెరపై కి వచ్చింది. ఇందులో భాగంగానే సీబీఐ మరోసారి ఈ కేసు విచారణ మొదలు పెట్టింది. ఇకపోతే ఇంతకు ముందే ఈ కేసులో అరెస్ట్ అయిన సత్యం బాబును కోర్టు గతంలో నిర్ధోషిగా ప్రకటించిన విషయం విధితమే. అయితే మృతురాలి తల్లిదండ్రులు మరోసారి కోర్టును ఆశ్రయించి ఈ కేసులో ఏం జరిగిందో నిజ నిజాలు తేల్చాలంటూ వేడుకుంది.
ఆయేషా మీరా హత్య కేసు.. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. హాస్టల్ ఉంటున్న ఆయేషా మీరాను రాత్రి సమయంలో గుర్తు తెలియని యువకుడు దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై రాష్ట్ర పోలీసు యంత్రాంగం అనేక కోణాల్లో విచారణ చేపట్టింది. ఇక తీవ్ర ఒత్తిడి కారణంగా సత్యం బాబు అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక కొన్నాళ్ల తర్వాత అతడికి యావజ్జీవ శిక్ష కూడా పడింది. చివరికి కేసులో ట్విస్ట్ ఇస్తూ న్యాయస్థానం సత్యంబాబు నిర్ధోషి అంటూ ప్రకటిస్తూ విడుదల చేసింది. ఆ తర్వాత మృతురాలి తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు విచారణ ప్రారంభించాలంటూ సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే సీబీఐ తాజాగా హాస్టల్ వార్డెన్ ను పిలపించి విచారించింది. ఇక విచారణ అనంతరం ఆ వార్డెన్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
అసలేం జరిగిందంటే?
అది 2007 డిసెంబర్ 27. విజయవాడలోని ఇబ్రహీంపట్నం ప్రాంతం. ఇక్కడే ఆయేషా మీరా అనే యువతి బీఫార్మసీ చదువుకుంటూ ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఉండేది. ఇక అదే రోజు రాత్రి ఆ యువతి ఎప్పటిలాగే తిని నిద్రపోయింది. ఇక అర్థరాత్రి సమయంలో ఓ యువకుడు ఆయేషా ఉంటున్న హాస్టల్ లోకి చొరబడ్డాడు. అదే సమయంలో రూమ్ లో నిద్రపోతున్న ఆయేషాను ఆ యువకుడు దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం కూడా చేశాడని వార్తలు వచ్చాయి. ఇదే ఘటన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారింది. ఈ కేసులో భాగంగా సత్యం బాబు అనే యువకుడిని అరస్ట్ చేసి ఆ తర్వాత నిర్ధోషి అంటూ ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు ఈ కేసులో ఏం జరిగిందనేది తెలియకపోవడంతో విశేషం.