ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో చడ్డీ గ్యాంగ్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. చడ్డీలు వేసుకొని టార్గెట్ చేసిన ఇళ్లలో దొంగతనాలకు చేస్తూ.. అడ్డు వచ్చిన వారిని కొట్టడం.. చంపడం లాంటివి చేసేవారు చడ్డీ గ్యాంగ్. ఇటీవల కాలంలో అర్థరాత్రి అయితే చాలు.. భయంభయంగా ఎప్పుడు తెల్లవారుతుందో అని ఎదురుచూసే పరిస్థితి. ఎవరు తలుపుతట్టినా చెడ్డీగ్యాంగ్ వచ్చిందేమో అని కంగారు. ఇలా చాలామంది చెడ్డీగ్యాంగ్ ఆగడాలతో బెంబేలెత్తిపోయారు.
గత కొంత కాలంగా సైలెంట్ గా ఉన్న చెడ్డీ గ్యాంగ్ మళ్లీ హైదరాబాద్‌లో చోరీలకు తెగబడుతున్నారు. హయత్ నగర్ శివారు ప్రాంతంలో చడ్డీగ్యాంగ్ మరోసారి రెచ్చిపోయారు. వరుసగా నాలుగు ఇండ్లలో చోరీ చేసి మరోసారి పోలీసులకు సవాల్ విసిరారు. అయితే ఈ చోరీకి ముందు చెడ్డీ గ్యాంగ్ ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తుంది. స్థానికులు వెంటనే సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ చోరీ ఘటనతో హైదరాబాద్ ప్రజలు మరోసారి జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. ఇక చెడ్డీ గ్యాంగ్ బంగారం, వెండి, పదివేల నగదు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఘటన స్థలంలో సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. గత ఏడాది కూడా ఇదే గ్రేటర్ కమ్యూనిటీ చెడ్డీ గ్యాంగ్ దొంగతనానికి పాల్పడ్డట్టు సమాచారం. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: Bore Well: బోరు బావిలో పడ్డ బాలుడు.. 5 గంటలు నరకం.. చివరి…