Crime News: చిన్న వివాదం ముగ్గురు వ్యక్తుల్ని రాక్షసుల్లా మార్చేసింది. సొంత మనిషిని చంపేలా చేసింది. ఇంటి పెంకులు కూల్చేశాడన్న కోపంతో ఓ వృద్దుడిని స్తంబానిక కట్టేసి.. కొట్టి చంపేశారు కుటుంసభ్యులు. ఈ సంఘటన ఒరిస్సాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఒరిస్సా, కోరపుట్ జిల్లా, ఉపరకుటింగ అనే గ్రామానికి చెందిన కుర్సా మానియాక్ గత శుక్రవారం కొడుకు, సోదరుడు, కోడలుతో గొడవ పడ్డాడు. ఈ గొడవ సందర్బంగా వృద్దుడు తన కొడుకు ఇంటి పెంకులు కొన్ని పగులగొట్టాడు.
ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన కొడుకు, కోడలు, సోదరుడు వృద్దుడ్ని ఇంటి దగ్గరలోని కరెంట్ స్తంబానికి కట్టేశారు. కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేశారు. కుర్సా ఎంత బతిమాలినా విడిచిపెట్టలేదు. దెబ్బలు తాళలేక అతడు గట్టిగా అరుస్తున్నా కర్రతో చితకబాదారు. ఆ దెబ్బలు తాళలేక కుర్సా అక్కడికక్కడే చనిపోయాడు. అతడు చనిపోవటంతో భయాందోళనకు గురైన కుటుంబసభ్యులు వెంటనే అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. కొంతమంది గ్రామస్తుల సహాయంతో అంత్యక్రియలు పూర్తి చేశారు.
అయితే, ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో తనఖీలు నిర్వహించి ఓ నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : దారుణం.. కవల పిల్లల నోట్లో విషం పోసి!