అది ఉత్తర్ ప్రదేశ్ కౌశాంబి జిల్లాలోని ప్రొబేషన్ కార్యాలయం. ఇక్కడే రామ్ నాథ్ రామ్ (65) అనే వ్యక్తి ప్రొబేషన్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఉన్నతమైన హొదాలో పని చేస్తున్న ఈ కేటుగాడు తోటి ఉద్యోగులతో స్నేహపూర్వకంగా మెలగాల్సింది పోయి కామంతో కాటువేయాలని చూశాడు. అయితే ఇతగాడు పని చేస్తున్న ఆఫీసులో ఓ మహిళా ఉద్యోగి పని చేస్తుంది. ఈ దుర్మార్గుడు ఎప్పటి నుంచో ఆ మహిళా ఉద్యోగిపై కన్నేశాడు. ఎలాగైన ఆ మహిళను లోబరుచుకుని కోరిక తీర్చుకోవాలనుకున్నాడు.
గతంలో అనేక ప్రయత్నాలు చేశాడు. కానీ అవేవీ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఈ సారి మాత్రం పక్కా ప్లాన్ తో వెళ్లిన రామ్ నాథ్ రామ్ ఏదో పని ఉందని అదే మహిళా అధికారిని తన ఆఫీసులోకి రమ్మని కబురు పంపాడు. అతని కోరినట్లుగానే ఆ యువతి అతని ఆఫీసులోకి వచ్చింది. ఇక ఆ యువతి రాగానే రామ్ నాథ్ ఏదో మాట్లాడుతున్నట్లుగా నటించి మెల్లగా ఆమె ప్రైవేట్ పార్ట్ పై చేతులు వేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇతని పాడు చేష్టలను గమనించిన ఆ యువతి అతడి ఆఫీసు నుంచి బయటకు వచ్చింది. ఇదంతా ఆఫీసులో ఉన్న కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
అనంతరం రామ్ నాధ్ రామ్ లైంగిక వేధింపులపై ఆ మహిళా అధికారి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రామ్ నాథ్ రామ్ లైంగిక వేధింపుల పట్ల సమాజ్ వాది పార్టీ మీడియా సెల్ స్పందించి సీఎంను ప్రశ్నించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ అధికారు పాడు పనులు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఆఫీసులో మహిళా ఉద్యోగిని లైంగిక వేధింపులకు పాల్పడిన ఇతగాడికి మీరైతే ఎలాంటి శిక్ష విధిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లా ప్రొబేషన్ కార్యాలయంలో ఇటీవల దారుణ ఘటన జరిగింది. ఆఫీసులో పని చేసే మహిళా ఉద్యోగిని జిల్లా ప్రొబేషన్ అధికారి రామ్‌నాథ్ రామ్ వేధించాడు. ఆమె శరీరంపై చేతులు వేసి ఇబ్బంది పెట్టాడు. ఈ వీడియోను సమాజ్‌వాదీ పార్టీ మీడియా సెల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. pic.twitter.com/NDlkBXhqwC
— Hardin (@hardintessa143) December 28, 2022