తల్లీ కొడుకు పేగు బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే.. తన పిల్లల కోసం తల్లి ఏంతటి త్యాగానికైనా సిద్దపడుతుంది. నవమాసాలు మోసి కనీ పెంచిన పిల్లల కోసం తన జీవితాంతం కష్టపడుతూనే ఉంటుంది. తల్లిని ప్రేమించే తనయులు ఆమెకు ఏ చిన్న కష్టమొచ్చినా తట్టుకోలేరు.
అమ్మ గురించి ఎన్ని చెప్పినా తక్కువే.. మాటలకు అందనిది అమ్మ ప్రేమ. ఆమె కోసం మనం ఏం చేసినా తక్కువే.. ఏమి ఇచ్చినా తక్కువే. తల్లి ప్రేమ సృష్టిలో వెలకట్టలేని మధురమైన ప్రేమగా.. పంచేకొద్ది పెరిగే ప్రేమ అంటారు. నవ మాసాలు మోసి తన రక్త మాంసాలు పంచి అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో తన పసికందును చూసి ఆమెపడ్డ ప్రసవవేదన అంతా మర్చిపోతుంది. తల్లి ప్రేమ ఈ ప్రపంచాన్నే మరిపింపజేస్తుంది.. తల్లే మనకు మొదటి గురువు. ఆ దేవుడు అన్ని చోట్ల తాను ఉండలేక, అమ్మను సృష్టించాడని పెద్దలు అంటుంటారు. తన పిల్లలపై తల్లి చూపించే ప్రేమ, ఆప్యాయత ముందు ఏద సాటిరాదు అని ఎన్నోసార్లు నిరూపితమైంది. తల్లిని ప్రేమించే తనయులు ఎంతోమంది ఉన్నారు.. తల్లికి ఏ చిన్న కష్టమొచ్చినా తల్లడిపోయే తనయులు ఎంతోమంది మనకు తారసపడుతుంటారు. తన తల్లి మరణ వార్త తెలుసుకొని.. తనయుడు గుండె ఆగిపోయింది. వివరాల్లోకి వెళితే..
తల్లి అంటే ఎంతో ఇష్టం.. ఆమెకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా తట్టుకోలేడు ఆ కొడుకు. తల్లీ కొడుకులది విడిపోని పేగుబంధం. తల్లి మరణ వార్త తెలుసుకొని తనయుడు గుండె కూడా ఆగిపోయింది. ఈ విషాద ఘటన రాజాం పట్టణంలో చోటు చేసుకుంది. రాజాం పట్టణానికి చెందిన యందవ కురమమ్మ (50) శ్రీకాకుళం జిల్లా పలాస ఆర్టీసీ డిపో లో కండక్టర్ విధులు నిర్వహిస్తుంది. ఆదివారం విధులకు హాజరైన కురమమ్మ కు ఒక్కసారే గుండెపోటు రావడం.. దానికి తోడు బీపీ, షుగర్ లెవల్స్ ఒక్కసారే పడిపోవడంతో వెంటనే పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో టెక్కలి ఏరియా ఆస్పత్రికి తరలించే ప్రయత్నిస్తుండగా గుండెపోటు కు గురై మృతి చెందినట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ తెలిపారు. కురమమ్మ మృతితో బంధవులు విషాదంలో మునిగిపోయారు.
యందవ కురమమ్మకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కుమారుడు యందవ అమర్ (24) కొంత కాలంగా ఏలూరు లోని ఆర్‌సీఎం చర్చీలో ఫాదర్ గా శిక్షణ తీసుకుంటున్నాడు. తల్లి అంటే ఎంతగానో అభిమానించే అమర్ ఆమె మరణవార్త వినగాను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానికులు అమర్ ని ఆస్పత్రికి తరలించేలోపు కన్నుమూశాడు. అమర్ చనిపోయిన వార్త తెలుసుకున్న బంధువులు అమర్ మృతదేహాన్ని తీసుకువ వచ్చేందుకు పయనం అయినట్లు స్థానికులు తెలిపారు. తల్లి మరణ వార్త వినగానే కుప్పకూలి చనిపోయిన తనయుడు మరణం గ్రామంలో వీవ్ర విషాదాన్ని నింపింది. కురమమ్మ కుటుంబం సభ్యులు కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. వారి ఆవేదన చూసి గ్రామస్థులు సైతం కంటతడి పెట్టారు.