ఈ మద్య దొంగలు బాగా తెలివిమీరి పోయారు.. ఒకప్పడు ఇంట్లో చొరబడి డబ్బు, నగలు, విలువైన వస్తువులు చోరీలు చేసేవారు.. కానీ ఇప్పుడు కొత్త కొత్త పద్దతుల్లో చోరీలకు పాల్పపడుతున్నారు. కొంత మంది దొంగలు తమకు పాపులారిటీ రావాలని తాము చేసే దొంగతనాలకు సంబంధించిన వివరాలు ఇస్తూ.. పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఓ పాఠశాలలో దొంగలు పడ్డారు.. అంతటితో ఆగకుండా చేతనైతే పట్టుకోండంటూ పోలీసులకు సవాల్ విసిరారు. ఈ ఘటన ఒడిస్సాలోని నవరంగ్‌పూర్ జిల్లాలోని ఓ స్కూల్లో చోటుచేసుకుంది.
ఒడిశాలోని ఖతీగూడలో ‘ఇంద్రావతి’ పాఠశాలలో కొంత మంది దొంగలు చోరీకి పాల్పపడ్డారు. ఆ దొంగలు హెడ్ మాస్టర్ గదిలో ఉన్న పలు ముఖ్యమైన వస్తువులు.. కంప్యూటర్లు, జీరాక్స్ మెషిన్లు తదితర వస్తువులు ఎత్తుకెళ్లారు. అక్కడితో ఆగకుండా సినిమా లెవెల్లో బిల్డప్ ఇస్తూ.. దమ్ముంటే మమ్ముల్ని పట్టుకోండి అంటూ కొన్ని ఫోన్ నెంబర్లు బ్లాక్ బోర్డ్ పై రాశి వెళ్లారు. అంతేకాదు ధూమ్ 4 తొందర్లో వస్తుందని రాసి వెళ్లారు.
ఈ ఘటన జరిగిన తెల్లారి స్కూల్ కి వెళ్లిన ప్యూన్ హెడ్ మాస్టర్ గదిలో తలుపు పగలగొట్టి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. హెడ్ మాస్టర్ రూమ్ లో పలు సామాన్లు చోరీకి గురయ్యాయని గమనించి.. వెంటనే పై అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రధానోపాధ్యాయుడు సర్బేశ్వర్ బెహెరా ఖతీగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
దొంగలు తమ సెల్ ఫోన్ నెంబర్లు ఇచ్చి పోలీసుకు సవాల్ విసరడంతో.. దుండగులు గురించి ఆధారాలు సేకరించేందుకు సైంటిఫిక్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్‌తో పాటు పోలీసు బృందం పాఠశాలను సందర్శించింది. అంతేకాదు ఈ విషయాన్ని పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. త్వరలో దుండగులను తప్పకుండా పట్టుకుంటాం అని పోలీస్ అధికారి వెల్లడించారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.