మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురై చాలా మంది అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వీటి నుంచి భయటపడేందుకు తల్లిదండ్రులకు చెప్పడమో లేదంటే వైద్యులను సంప్రదించడమో చేయాలి. కానీ ఇవేవి చేయకుండా కొంతమంది తమలో తాము కుమిలిపోతూ చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సరిగ్గా ఇలాగే ఓ సమస్యతో బాధపడ్డ ఓ యువతి చివరికి బలవన్మరణానికి పాల్పడింది. తాజాగా ఒడిశాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. బోలంగీర్ జిల్లాలోని జముకోలిలో ఓ 19 ఏళ్ల నర్సింగ్ చదువుతూ స్థానికంగా ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఉంటుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి ఈ యువతి నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. రాత్రిళ్లు అందరూ పడుకున్నాక నిద్రపోకుండా హాస్టల్ మొత్తం తిరుగుతూ తీవ్ర ఒత్తిడికి గురయ్యేది. అనేక సార్లు ఆమె స్నేహితులు సైతం ఇంటికి వెళ్లిపోమంటూ కూడా సూచించారు. కానీ ఆ యువతి ఇవేవి లెక్కచేయకుండా రాత్రిళ్లు నిద్రపోకుండా బాధపడుతూ ఉండేది. కాగా ఇటీవల నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న ఆ యువతి భరించడం నా వల్ల కాదనుకుందో మేమో తెలియదు కానీ.. ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆ యువతి గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
తర్వాత తన స్నేహితులు ఆమె గదిలోకి వెళ్లి చూడగా ఉరి వేసుకుని కనిపించింది. ఈ సీన్ ను చూసిన అక్కడున్న అమ్మాయిలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అదే గదిలో ఓ సూసైడ్ నోట్ కూడా రాసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న హాస్టల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ విషాద ఘటనతో కూతురు తల్లిదండ్రులకు కంట కన్నీటిని మిగిల్చి పోయింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.