కనిపెంచిన కొడుకు మద్యానికి బానిసై గుట్కా, సిగరెట్లు, బెట్టింగ్ వంటి చెడు మార్గాల్లో అడుగులు వేస్తుంటే ఏ తల్లిదండ్రులు కూడా చూసి చూడనట్టుగా వదిలేయరు. వాడిని సరైన మార్గంలో దిశానిర్దేశం చేస్తూ భవిష్యత్ జీవితంపై వివరించి మంచి మార్గంలో నడవాలంటూ బుద్దిచెబుతారు. కానీ ఓ కుమారుడు బెట్టింగ్ కు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకుంటుంటే అడ్డుచెప్పాల్సిన తల్లే ఏకంగా కుమారుడితో పాటు బెట్టింగ్ లో పాలు పంచుకుంది. ఇక చివరికి ఈ వ్యవహారం బెడిసికొట్టడంతో కొడుకుతో పాటు తల్లి ఆత్మహత్య చేసుకుంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన విషాదంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది ఒడిశాలోని ఓ ప్రాంతం. ఇది ఐపీఎల్ సీజన్ కావడంతో ఓ యువకుడు జోరుగా బెట్టింగ్ లో పాలు పంచుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఈ యువకుడి తల్లి కొడుకుతో పాటు బెట్టింగ్ లో పాల్గొనేందుకు ముందుకు వచ్చింది. దీంతో ఇద్దరు కలిసి కొన్ని రోజుల పాటు బెట్టింగ్ లో పాల్గొన్నారు. చివరికి వీరి వ్యవహారం బెడిసికొట్టి పూర్తిగా నష్టపోయారు.
ఇది కూడా చదవండి: Siddipet: పెళ్లైన నెలకే భార్య దారుణం.. ప్రియుడిని దక్కించుకునేందుకు భర్తను హత్య చేసింది!అప్పులు ఎక్కువై తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఇక చేసేదేం లేక తల్లీకొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇక దర్యాప్తులో భాగంగా పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఇటీవల ఆ మహిళ కూతురు పెళ్లి చేసిందిని, అప్పులు తీర్చేందుకే ఈ బెట్టింగ్ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.