ఈ మధ్యకాలంలో ప్రేమ వ్యవహారంలో హత్యలు, ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి. కూతురు కులం తక్కువ వాడిని ప్రేమించిందని, మతాంతర వివాహం చేసుకుందని, ప్రేమ పేరుతో పరువు తీస్తుందని ఇలాంటి కారణాలలో యువతి కుటుంబ సభ్యులు హత్యలకు తెగబడుతున్నారు. ఇలాంటి ఘటనలోనే ఈ మధ్యకాలంలో హైదరాబాద్ నడిబొడ్డున రెండు పరువు హత్యలు జరిగిన విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ హత్యలు సంచలనంగా మారాయి.
ఇదిలా ఉంటే చాలా ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్న ఓ జంట పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల ఒడిషాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇక స్థానికులు తెలిపిన కథనం ప్రకారం. ఒడిషాలోని పత్రపూర్ బ్లాక్ పరిధిలో సమంతరాయ్‌పల్లి గ్రామం. ఇదే ప్రాంతానికి చెందిన సోను బెహరా(20), సునీత ప్రధాన్(18) గత మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. పీకల్లోతు ప్రేమలో ఉన్న ఈ జంట ఎలాగైన పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు.
ఇది కూాడా చదవండి: Tamil Nadu: ప్రేమించి పెళ్లి చేసుకుంది.. అరటి పండు కోసం భర్తను పొడిచి చంపింది!
అందులో భాగంగానే ఇటీవల వీరి ప్రేమ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకు వెళ్లారు. కానీ వీరి పెళ్లికి పెద్దలు నిరాకరించారు. దీంతో ఈ ప్రేమ జంట తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో భరించలేని ప్రియుడు సోను బెహరా గ్రామ శివారులోని మామిడి తోటలో చెట్టుకి సోమవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు ఘటన స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించింది. దీంతో అక్కడే ఉన్న ప్రియుడి కుటుంబ సభ్యులు ఆ యువతిని సూటిపోటి మాటలతో దూషించారు.
దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ప్రియురాలు కొద్ది సేపటి తర్వాత ప్రియుడు ఉరేసుకున్న చెట్టుపక్కనే మరో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడు మరణించాడన్న బాధతో ప్రియురాలు సైతం ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇక స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.