అంతసేపు సరదాగా నెలకొని ఉన్న వాతావరణంలో.. చిన్న వివాదం కారణంగా దారుణాలు చోటు చేసుకున్న సంఘటనలు అనేకం చూశాం. ఇక తాజాగా ఈ కోవకు చెందిన దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
అంతసేపు అక్కడ సరదా వాతావరణం నెలకొంది. క్రికెట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. రెండు టీమ్‌లు గెలుపు కోసం భీకరంగా పోరాడుతున్నాయి. ప్రతి రన్ జట్టు గెలుపుకు కీలకంగా మారింది. ఇలాంటి సమయంలో అంపైర్ ఓ బాల్‌ను నో బాల్‌గా డిక్లేర్ చేశాడు. దాంతో ఆగ్రహించిన క్రికెటర్.. గ్రౌండ్‌లోనే అందరూ చూస్తుండగా.. కత్తితో అత్యంత దారుణంగా.. అంపైర్‌ను హత్య చేశాడు. అంతసేపు ఎంతో ఉత్సాహంగా ఉన్న గ్రౌండ్‌లో భయంకర వాతావరణం నెలకొంది. ఈ దారుణం చూసి ప్రేక్షకులు భయంతో పరుగులు తీశారు. ఏం జరిగిందో అర్థం కావడానికి కొన్ని సెకన్ల సమయం పట్టింది. ఈ దారుణం వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ విషాదకర సంఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. చనిపోయిన అంపైర్‌ని 22 ఏళ్ల లక్కి రౌత్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ సంఘటన ఒడిశా, కటక్‌లో జరిగింది. బ్రహ్మపూర్, శంకపూర్ గ్రామాల మధ్య ఆదివారం సాయంత్రం క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఇరు గ్రామాలకు చెందిన కొందరు యువకులు సరదాగా క్రికెట్ ఆడుకుంటున్నారు. చనిపోయిన లక్కీ రౌత్.. ఈ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో గేమ్‌లో భాగంగా ఓ బాల్‌ను నో బాల్‌గా డిక్లేర్ చేశాడు లక్కీ రౌత్. దాంతో ఆగ్రహించిన స్మృతి రంజన్ రాట్ అనే వ్యక్తి.. లక్కీ రౌత్‌తో గొడవకు దిగాడు.
ఇద్దరి మధ్య మాటా మాట పెరిగింది. ఆ కోపంలో స్మృతి రాట్.. తన దగ్గర ఉన్న కత్తి తీసుకుని.. లక్కీ రౌత్ మీద విచక్షణా రహితంగా దాడి చేశాడు. దాంతో ఒక్కసారిగా అక్కడ భయానక వాతావరణం నెలకొంది. లక్కీ రౌత్ మీద దాడి చేసిన తర్వాత స్మృతి అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. కానీ మిగతా వాళ్లు అతడిని అడ్డుకుని.. పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. స్మృతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన లక్కీ రౌత్‌ను సీబీ మెడికల్ కాలేజ్ అండ్ హస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు.. వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనతో రెండు గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ ప్రారంభించారు. సరదాగా మొదలైన మ్యాచ్ కాస్త.. ఇలా విషాదంగా ముగియడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.