ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు.. తల్లిదండ్రులు మంచి సంబంధం చూసి వివాహం చేశారు. నిండు నూరేళ్లు.. భార్యా బిడ్డలతో కలిసి సంతోషంగా జీవించాల్సిన వ్యక్తి.. 95 శాతం కాలిపోయిన గాయాలతో.. దారుణ స్థితిలో కనిపించాడు. ఆ తర్వాత కన్నుమూశాడు. తాజాగా ఈ కేసును పునఃవిచారణ చేయాలని కోర్టు ఆదేశించింది. ఆ వివరాలు..
గత కొంతకాలంగా సమాజంలో నేరాల సంఖ్య పెరిగిపోతుంది. అకారణంగా, ఆవేశంలో, చిన్న చిన్న కారణాలకే దారుణాలకు పాల్పడుతున్నారు జనాలు. క్షణికావేశంలో ఏం చేస్తున్నారో ఆలోచన లేకుండా.. నేరాలకు పాల్పడటం.. ఆనక జైలుకు వెళ్లి.. తన జీవితాన్ని మాత్రమే కాక.. తమ మీద ఆధారపడ్డ వారి జీవితాలను సైతం నాశనం చేస్తున్నారు. ఇక నేటి కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా చోటు చేసుకుంటున్న నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ తరహా నేరాలకు పాల్పడుతున్న వారిలో మహిళల సంఖ్య అధికంగా ఉండటం కలవరపెడుతోంది. భర్త, పిల్లలు ఉన్నప్పటి కూడా.. పరాయి మగాడి మీద మోజు పడి.. పచ్చని సంసారాలను నాశనం చేసుకుంటున్నవారు ఎందరో ఉన్నారు. క్షణకాల సుఖం కోసం.. తమ జీవితాలనే కాక.. భర్త, పిల్లల భవిష్యత్తును సైతం నాశనం చేస్తున్నారు. కొన్ని నేరాల్లో నిందితులు పట్టుబడుతున్నారు.. కొన్ని కేసుల్లో నిందితులు ఎవరో తెలియక.. కేసులు అలానే పెండింగ్‌లో ఉంటున్నాయి. తాజాగా ఈ కోవకు చెందిన కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
ఒడిశాలో.. రెండు సంవత్సరాల క్రితం.. అనగా 2021లో ఓ ప్రభుత్వ ఉద్యోగి.. అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రెండు సంవత్సరాలు అవుతున్నా సరే.. ఈ కేసులో నిందితులు ఎవరో గుర్తించలేకపోయారు పోలీసులు. బాధితుడి తండ్రి కోరిక మేరకు.. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న బాధితుడి భార్య, ఆ ఇంటిలో వంట చేసే వ్యక్తిని విచారణకు ఆదేశించారు పోలీసులు. ఈ సంఘటన పర్లాకిమిడి జిల్లా అటవీశాఖ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (ఏసీఎఫ్) సౌమ్యనంజన్ మహాపాత్రొ.. 2021, జూలై 21న అనుమానస్పద రీతిలో మృతి చెందాడు. సుమారు 95 శాతం శరీర భాగాలు కాలిన స్థితిలో సౌమ్యనంజన్ బాడీ లభించింది. ఆయనను ఆస్పత్రిలో చేర్చగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇక ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. కేసు విచారణ కోసం ప్రభుత్వం సిట్‌ను నియమించింది.
అయితే రెండేళ్లు గడుస్తున్నా సరే.. ఈ కేసులో పురోగతి సాధించలేకపోయారు సిట్ అధికారులు. కేసును క్లోజ్ చేయాలని భావిస్తున్నారు. అయితే మృతుడు సౌమ్యనంజన్ తండ్రి అభిరాం మహాపాత్రొ కేసుపై పునఃవిచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు పర్లాకిమిడి ఎస్‌డీజేఎం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని స్వీకరించిన కోర్టు.. ఏప్రిల్ 27న విచారణకు హాజరు కావాల్సిందిగా.. ఈ కేసులో నిందితులు కోర్టు నోటీసులు పంపింది. మరి ఈకేసులో నిందితులు ఎవరంటే.. అప్పటి డీఎఫ్‌ఓ సంగ్రాంకేసరి బెహరా, సౌమ్యనంజన్ భార్య విద్యాభారతీ పండా, వంటవాడు మన్మథ ఖంబాలను నిందితులుగా చేర్చారు. దాంతో వీరిని మరోసారి విచారణకు హాజరుకావాలసిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరి ఈ విషాదకర సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.