హైదరాబాద్ లో అనురాధ హత్య ఘటన తీవ్ర కలకలంగా మారిన విషయం తెలిసిందే. మూసీ ఒడ్డున తల, ఫ్రిడ్జ్ లో మొండెం దాచి వళ్లు గగుర్పోడిచేలా ఉన్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే?
ఈ నెల 17న హైదరాబాద్ మలక్ పేట్ పరిధిలోని ఛాదర్ ఘట్ మూసీ నదిలో ఒడ్డున మొండం లేని మనిషి తల స్థానికులకు కనిపించిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ తలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత తల ఇక్కడుంటే మొండం ఎక్కడుంది? అసలేం జరిగిందనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అసలు ఆ మహిళ ఎవరు? ఆమెను హత్య చేసింది ఎవరు? అసలు ఈ క్రైమ్ స్టోరీలో ఏం జరిగిందని విచారించగా పోలీసులకు సంచలన నిజాలు బయటపడ్డాయి.
అసలేం జరిగిందంటే?
ఆమె పేరు అనురాధ రెడ్డి, వయసు 55 ఏళ్లు. గతంలో ఆమె భర్తకు విడాకులు ఇచ్చింది. ఆమె ఒక్కగానొక్క కూతురు ఆస్ట్రేలియాలో నివాసం ఉంటుంది. అనురాధ మాత్రం హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రిలో నర్సు గా పని చేస్తూ నగరంలోనే ఉంటుంది. అయితే ఇదే ఆస్పత్రి గతంలో ఓ వ్యక్తికి సర్జీరి జరిగింది. ఆ సర్జీరి జరిగిన సమయంలో అనురాధ ఆస్పత్రిలో ఆ వ్యక్తికి సేవలు అందించింది. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి కుమారుడైన చంద్రమోహన్ నర్సు అనురాధకు పరిచయం అయ్యాడు. దీంతో ఇద్దరు ఒకరి వివరాలు ఒకరు తెలుసుకున్నారు. మెల్ల మెల్లగా వీరి బంధం బలపడింది. ఈ నేపథ్యంలోనే అనురాధ కొన్ని రోజుల తర్వాత చంద్రమోహన్ ఇంట్లో అద్దెకు దిగింది. ఇక్కడే కొన్ని రోజుల పాటు ఒంటరిగా ఉంటూ డ్యూటీకి వెళ్లేది.
ఇదిలా ఉంటే చంద్రమోహన్.. గతంలో అనురాధ దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. నిర్ణిత కాల వ్యవధిలో తీసుకున్న డబ్బును మిత్తితో సహా తిరిగి ఇచ్చేశాడు. అలా అనురాధ వద్ద చంద్రమోహన్ నమ్మకాన్ని సంపాదించాడు. దీంతో అనురాధ అతనికి అడిగినప్పుడల్లా డబ్బు ఇస్తూ వచ్చింది. అలా రాను రాను ఏకంగా ఆమె ఇచ్చిన అప్పు ఏకంగా రూ.7 లక్షలకు దాటింది. చాలా రోజులు గడవడంతో ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని అనురాధ అతడిని కోరింది. చంద్రమోహన్ మాత్రం ఈ రోజు, రేపు అంటూ కాలాన్ని వెల్లదీశాడు. కానీ, ఎందుకో అనురాధకు చంద్రమోహన్ పై అనుమానం కలిగింది. ఇక డబ్బు తిరిగి ఇవ్వాల్సిందే అంటూ పట్టుబట్టింది. చంద్రమోహన్ చేతిలో చిల్లి గవ్వలేదు. డబ్బు ఎలా ఇవ్వాలనేది అతడికి అస్సలు అర్థం కాలేదు. అనురాధ మాత్రం రోజు రోజుకు అతడిని టార్చర్ చేసింది.
అనురాధ హత్యకు కుట్ర:
ఇక ఈ సమయంలోనే చంద్రమోహన్ కు ఓ ఐడియా తట్టింది. అదే.. అనురాధను చంపడం. ఇందులో భాగంగానే చంద్రమోహన్ పక్కా ప్లాన్ గీసుకున్నాడు. డబ్బుల విషయంపై ఈ నెల 12న అనురాధతో గొడవకు దిగాడు. ఇదే కోపంతో చంద్రమోహన్ అనురాధను అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె శరీరాన్ని తల, మొండాన్ని వేరు చేశాడు. ఆ తర్వాత ఆమె కొనుగోలు చేసిన పదునైన ఆయుధాలతో ఆమె శరరాన్ని భాగాలుగా విడదీసి తల తప్పా.. మిగతా భాగాలను ఫ్రిడ్జ్ లో దాచి పెట్టాడు. ఇక ఇంట్లో వాసన రాకుండా అగరబత్తులు, కర్పూరం వంటివి చల్లాడు. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే? ఇంకా ఆమె బతికే ఉన్నట్లు ఆమె ఫోన్ నుంచి అందరికీ మెసేజ్ లు చేస్తూ వచ్చాడు.
ఇదిలా ఉంటే చంద్రమోహన్ ఈ నెల 17న అనురాధ తలను మలక్ పేట్ పరిధిలోని ఛాదర్ ఘట్ మూసీ నది ఒడ్డున వదిలేసి వెళ్లిపోయాడు. దీనిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ తలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మిస్సింగ్ కేసులను తెలుసుకున్నారు. ఎక్కడా కూడా ఆమె పేరు మీద మిస్సింగ్ కేసు నమోదు కాలేదని పోలీసులు తెలుసుకున్నారు. ఏదో జరిగిందంటూ పోలీసులు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇంతకు ఆ మహిళా మిగతా పార్ట్స్ ఎక్కడున్నాయి? ఆమెను హత్య చేసింది ఎవరు? ఎందుకు చంపారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టగా నిందితుడు చంద్రమోహన్ అని తెలింది.
దీంతో పోలీసులు నిందితుడైన చంద్రమోహన్ ను అదుపులోకి తీసుకుని విచారించగా తన నేరాన్ని అంగీకరించాడు. ఆ తర్వాత అతడు ఫిడ్జ్ లో దాచి పెట్టిన ఆమె మొండాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అతడు హత్య చేసిన తీరు, దొరకకుండా తీసుకున్న జాగ్రత్తలు వంటివి తెలుసుకుని పోలీసులు షాక్ గురయ్యారు. ఢిల్లీలోని జరిగిన శ్రద్ధా వాకర్ తరహా ఘటన మరువకముందే హైదరాబాద్ లో అనురాధ హత్య ఘటన వెలుగు చూసింది. ఇదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలన్నందుకు నమ్మిన వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేసిన ఈ చంద్రమోహన్ దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.