ఈ రోజుల్లో కొందరు పెళ్లైన వ్యక్తులు కట్టుకున్న వాళ్లను కాదని పరాయి వాళ్లతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారు. అచ్చం ఇలాగే వివాహేతర సంబంధాన్ని నడిపించిన వీరి స్టోరీ చివరికి ఊహించిన మలుపుకు తిరిగింది. అసలేం జరిగిందంటే?
అతని పేరు ప్రవీణ్ కుమార్. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఇతడు.. స్థానికంగా ఉండే ఓ వ్యక్తి వద్ద జేసీబీ డ్రైవర్ గా పనికి కుదిరాడు. కొన్ని రోజుల పాటు అతడి వద్ద ప్రవీణ్ కుమార్ నమ్మకంగా పని చేశాడని, ఆ తర్వాతే యజమాని భార్యపై కన్నేసినట్లుగా తెలుస్తుంది. అంతేకాక యజమాని భార్య కూడా డ్రైవర్ తో తెర వెనుక సంసారానికి పచ్చ జెండా ఊపినట్లుగా సమాచారం. ఇకపోతే ఇటీవల అర్థరాత్రి ప్రవీణ్ కుమార్ యజమాని ఇంటికి వెళ్లాడు. ఇక అనుమానంతోనే యజమాని డ్రైవర్ ను మందలించాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలంలోని జుజ్జూరు గ్రామం. ఇక్కడే రామారావు, భార్గవి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. భర్త రామారావు రేషన్ డీలర్ గా పని చేస్తుండగా, భార్య మాత్రం గ్రామ సచివాలయంలో ఏఎన్ఎంగా పని చేస్తుంది. ఇదిలా ఉండే రామారావు గతంలో ఓ జేసీబీని కొనుగోలు చేశాడు. దీనిని నడిపించేందుకు రామారావు స్థానికంగా ఉండే ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తిని డ్రైవర్ గా పెట్టుకున్నాడు.
దీంతో ప్రవీణ్ కుమార్ రామారావు వద్ద నమ్మకంగా పని చేస్తూ కొన్నాళ్లపాటు జేసీబీని నడిపించాడు. అలా రాను రాను.. డ్రైవర్ ప్రవీణ్ కుమార్.. రామరావు భార్య భార్గవితో వివాహేతర సంబంధం నడిపించాడు. దీనికి రామరావు భార్య భార్గవి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇద్దరూ కొన్నాళ్ల నుంచి తెర వెనుక సంసారాన్ని నడిపించారు. అయితే ఈ నేపథ్యంలో డ్రైవర్ ప్రవీణ్ కుమార్ శుక్రవారం అర్థరాత్రి రామరావు ఇంటికి వెళ్లాడు. దీనిని గమనించిన రామరావు.. అతనిని మందలించాడు.
ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ కుమార్, రామరావు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. దీనిని గమనించిన ప్రియురాలు భార్గవి, ప్రవీణ్ కుమార్ తో పాటు అతని స్నేహితులతో కలిసి రామారావుపై దాడికి దిగారు. ఈ దాడిలో యజమాని రామరావు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన రామారావు కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతూ రామారావు శనివారం ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై రామరావు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.