పైన ఫొటోలో కనిపిస్తున్న యువతి పేరు భార్గవి. చిన్నప్పటి నుంచి ఆమెకు చదువు అంటే చాలా ఇష్టం. జీవితంలో గొప్పగా స్థిరపడాలని ఎన్నో కలలు కనేది. ఆ దిశగా ఆమె అనేక ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. అయితే ఈ క్రమంలోనే ఆ యువతి ఎప్పటిలాగే కాలేజీకి వెళ్లింది. కానీ ఉన్నట్టుండి భార్గవికి కడుపులో మంటగా అనిపించడంతో కాలేజి నుంచి ఇంటికి వచ్చింది. ఇదే విషయాన్ని తన తల్లిదండ్రలకు చెప్పింది. దీంతో వారు అలా చేయాలని చెప్పడంతో వారు చెప్పినట్లే చేసింది. కట్ చేస్తే ఉన్నట్టుండి ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. అసలు ఈ ఘటనలో ఆ యువతికి ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలంలోని భీమవరం గ్రామం. ఇక్కడే రాముడు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి పెళ్లై కూతురు భార్గవి (19), కుమారుడు ఉన్నారు. రాముడు స్థానికంగా మేస్త్రీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కూతురు భార్గవి స్థానికంగా ఇంటర్ చదువుతోంది. ఆ యువతి చదువుల్లో బాగా రాణించేది. అయితే భార్గవి ఎప్పటిలాగే బుధవారం కాలేజికి వెళ్లింది. ఇక ఉన్నట్టుండి ఆమె కడుపులో నొప్పిగా ఉండడంతో సడెన్ గా ఇంటికి వచ్చింది. ఇక వస్తూ వస్తూనే మధ్యలో ఓ టాబ్లెట్ వేసుకుంది. అనంతరం ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు ఇదే విషయాన్ని చెప్పింది.
దీంతో వారు ఓ టాబ్లెట్ వేసుకోవాలని సూచించారు. వారు చెప్పినట్లుగానే ఆ యువతి టాబ్లెట్ వేసుకుంది. కానీ కూతురుకి కడుపు నొప్పి మాత్రం తగ్గలేదు. దీంతో భార్గవి తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోవంతో ఆ యువతి మర్గమధ్యలోనే ప్రాణాలు విడిచింది. కూతురు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.