అదొక పారిశ్రామిక ప్రాంతం. ఎప్పుడూ జనాలు తిరిగే ప్రదేశం. వీటి పక్కనే ఓ లోయ, దాని పక్కనే వదిలేసిన 45 బ్యాగులు. ఏంటా అని కొందరు వ్యక్తులు అనుమానంతో తెరిచి చూడగా.. అందులో అన్నీ మనుషుల శరీర భాగాలే కనిపించాయి. వినటానికి భయంకరంగా ఉన్న ఇది నిజం. ఈ సీన్ చూసిన స్థానికులు వెంటనే అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. అసలేం జరిగిందంటే?
అది ఉత్తర అమెరికాలో జాలిస్కో రాష్ట్రం గాడలాజార ప్రాంతం. ఇక్కడే ఓ కాల్ సెంటర్ లో 30 ఏళ్ల వయసున్న ఏడుగురు యువకులు గత కొంత కాలంగా పని చేస్తున్నారు. అయితే, మే 30 నుంచి ఈ యువకులు కనిపించకుండాపోయారు. కుటంబ సభ్యులు స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే వారు పని చేసే సంస్థ సమీపంలోనే ఓ లోయ వద్ద 45 బ్యాగులు కనిపించాయి. ఏంటా అని కొందరు వ్యక్తులు అనుమానంతో బ్యాగులు తెరిచి చూడగా.. అందులో అన్నీ మనుషుల శరీర భాగాలే కనిపించాయి.
ఈ సీన్ చూసిన అక్కడి వారు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. అసలు ఇక్కడ ఈ బ్యాగులను ఎవరు వదిలేశారు? ఇంతకు ఆ బ్యాగుల్లో ఉన్న శరీర భాగాలు ఎవరివి? కనిపించకుండాపోయిన వ్యక్తుల శరీర భాగాలేనా అంటూ పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది. మరో విషయం ఏంటంటే? ఇలా బ్యాగుల్లో మనుషుల శరీర భాగాలు వదిలేయడం ఇదేం మొదటిసారి కాదట. 2021లో టోనాలా ప్రాంతంలో 70 బ్యాగులు, 2019లో 29 యువకులకు సంబంధించిన శరీర భాగాలతో 117 బ్యాగులు కనిపించడం అప్పట్లో సంచలనంగా మారింది.