గత కొన్ని రోజుల నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో లోన్ యాప్స్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. ఆ నిర్వాహకుల ఆగడాలను భరించలేక ఇటీవల ఏపీలోని ఓ యువతి సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే అంశం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణలో డబ్బు కట్టలేదని ఓ ఫైనాన్స్ సంస్థ ఏజెంట్లు ఏకంగా బాధితుడి ఇల్లునే సీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతటితో ఆగకుండా ఇంటిని స్వాధీనం చేసుకుంటున్నట్లు ఇంటి గోడలపై రాతలు కూడా రాశారు.
వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం కమలాపూర్. ఇదే గ్రామానికి చెందిన మోహన్ గతంలో ఓ సంస్థ నుంచి కొంత డబ్బును తీసుకున్నాడట. అయితే తన ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో కాస్త ఆలస్యం అవుతుందని చెప్పాడు. అయితే బాధితుడి వివరణపై స్పందించిన నిర్వాహకులు చచ్చినా సరే డబ్బుకట్టాల్సిందే అంటూ రెచ్చిపోయారు. ఎంత చెప్పినా ఏజెంట్లు వినకుండా అతని ఇల్లును సీజ్ చేశారు.
దీంతో మా కుటుంబ పరువు పోతుందని బాధితుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫైనాన్స్ సంస్థల వేధింపులపై ప్రభుత్వం చర్యలు తీసుకుని న్యాయం చేయాలంటూ బాధితుడు మోహన్ వాపోతున్నాడు. ఇలా బరితెగించి ఏకంగా ఇంటినే సీజ్ చేసిన ఫైనాన్స్ సంస్థ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.