పవిత్ర దేవాలయంగా భావించే బడిలో ఓ ఉపాధ్యాయుడు నీచానికి దిగాడు. చదువు చెప్పాల్సింది పోయి.. కామానికి తెరలేపాడు. పాఠాల వంకతో తనవైపే చూడాలని చెప్పే.. ఈ కీచక టీచర్ ఇండైరెక్ట్ మాటలు.. సంజ్ఞలతో.. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. దీంతో విసిగిపోయిన విద్యార్థినులు.. తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారందరు కలిసి అతడిని చితక్కొట్టారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. నిజామాబాద్ లోని మాడ్రన్ ఎయిడెడ్ పాఠశాలలో వెంకట రమణ అనే వ్యక్తి సైన్స్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఎలానూ సైన్స్ సబ్జెక్టు కదా! ఏం చెప్పినా.. నడుస్తుందిలే అన్న వంకతో కామవాంక్షకు తెరతీశాడు. పాఠాలు చెప్పే క్రమంలో.. ఇండైరెక్ట్ మాటలు, చేష్టలతో విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో, ఆవేదనకు గురైన విద్యార్థినిలు ఈ విషయాన్ని ఇంటి వెళ్లి తమ పేరెంట్స్‌కు చెప్పారు. ఈ క్రమంలో పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు అతనికి దేహశుద్ధి చేశారు. అనంతరం తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత పోలీసులు తీసుకువెళ్తున్న క్రమంలో కూడా అతడిని విద్యార్థులు పేరెంట్స్ తీవ్రంగా కొట్టారు. అనంతరం, చిరిగిన చొక్కాతోనే పోలీసులు అతడిని స్టేషన్‌కు తరలించారు.
ఈ విషయంపై ఓ విద్యార్ధి మాట్లాడుతూ.. “ఆ సార్ మాకు సైన్స్ చెబుతాడు. కారణంగా లేకుండా టచ్ చేస్తుంటాడు. నన్నే చూడండి అంటుంటాడు. చూసి నవ్వుతుంటాడు. ల్యాబ్ లో మార్కులు వేసేందుకు అభ్యంతకరంగా ప్రవర్తిస్తున్నాడు..” అని చెప్పుకొచ్చింది. ఇలాంటి కీచక టీచర్లు ఇంకా ఎవరైనా ఉంటె.. ఇతనికి జరిగిందే.. మీకు జరుగుతుందంటూ విద్యార్థినుల తల్లిదండ్రులు హెచ్చరించారు.