దేశంలో జరుగుతున్న దారుణాలను చూస్తుంటే సమాజం ఎటు పోతుందో అని భయంగా ఉంది. రోడ్డుపై అందంగా ఓ ఆడది కనిపిస్తే చాలు విర్రవీగి ప్రవర్తిస్తున్న కొందరు కేటుగాళ్లు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో సొంత తండ్రులే కూతుళ్లపై దారుణాలకు పాల్పడుతున్నారు. సరిగ్గా ఇలాగే బరితెగించిన ఓ తండ్రి కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 12 ఏళ్ల కూతురు కూడా ఉంది. అయితే గత కొంత కాలం నుంచి తండ్రి తన కన్న కూతురిపై కన్నేసి ఉంచాడు. ఇంతటితో ఆగకుండా ఏకంగా కూతురిని బదిరించి అత్యాచారం చేశాడు. కొన్ని రోజుల నుంచి కూతురు ప్రవర్తనలో కొన్ని మార్పులు గమనించిన తల్లి ఏంటని ప్రశ్నించింది. దీంతో కూతురు చెప్పిన మాటలు విన్న తల్లి ఒక్కసారిగా షాక్ కు గురైంది. భర్త దారుణాన్ని తట్టుకోలేకపోయిన భార్య వెంటనే పోలీసులుకు ఫిర్యాదు చేసింది. భార్య ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తను అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ దారుణ ఘటనలో తండ్రికి ఎలాంటి శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.