నిజమాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ తన చెవి కమ్మలు అమ్మి భర్త హత్యకు సుపారీ ఇచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. భర్తపై భార్యకు అంత పగ ఎందుకో తెలుసా?
భార్యాభర్తలు అన్నాక గొడవలు జరగడం సహజం. అంత దానికే కొందరు దంపతులు వీలైతే విడాకులు, కాకుంటే హత్యలకు పావులు కదుపుతున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే అచ్చం ఇలాగే బరితెగించిన ఓ మహిళ.. భర్తపై పగ తీర్చుకోవడానికి ఏకంగా తన చెవి కమ్మలు అమ్మి వచ్చిన డబ్బులతో భర్త హత్యకు సుపారీ ఇచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. భర్తపై భార్యకు అంత పగా ఎందుకు? అతడు చేసిన నేరమేంటంటే?
పోలీసుల కథనం ప్రకారం.. నిజమాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం ఇందల్వాయి గ్రామంలో గోపాల్-పీరుబాయి దంపతులు నివాసం ఉంటున్నారు. పెళ్లైన కొన్నాళ్ల పాటు ఈ భార్యాభర్తలు బాగానే సంసారం చేశారు. అయితే రాను రాను భర్త గోపాల్ మద్యానికి అలవాటు పడ్డాడు. తరుచు తాగొచ్చి భార్యతో గొడవకు దిగేవాడు. మద్యం తాగొద్దని భార్య అనేక సార్లు చెప్పి చూసింది. అయినా భర్త ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాలేదు. దీంతో పాటు భర్త వేధింపులు మరింత ఎక్కువవ్వడంతో భార్య పీరుబాయి తట్టుకోలేకపోయింది. భర్త తీరుతో విసుగిపోయిన ఆ మహిళ.. అతడి హత్యకు ప్లాన్ వేసింది. ఇందులో భాగంగానే పీరుబాయి తన చెవి కమ్మలు అమ్మి వచ్చిన రూ.2 లక్షలను మహేష్, చందర్ లకు భర్త హత్యకు సుపారీ ఇచ్చింది.
ఇక పథకం ప్రకారమే ఏప్రిల్ 30న చందర్, మహేష్ ఇద్దరు కలిసి గోపాల్ ను ఓ చోటుకు రమ్మన్నారు. వాళ్లు చెప్పిన చోటుకు అతడు వెళ్లగానే ఇద్దరు కలిసి గోపాల్ ను అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాలు బయటపెట్టారు. అనంతరం పోలీసులు మృతుడి భార్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. మద్యం తాగి రోజూ వేధించేవాడని, దీని కారణంగానే నా భర్తను హత్య చేయాలనుకున్నానని భార్య చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. తాగొచ్చి వేధిస్తున్నాడని భర్తను హత్య చేయించిన భార్య దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.