వాట్సాప్ మేసేజ్ ఓ వ్యక్తి ప్రాణాన్ని తీసింది. మీరు చదివింది నిజమే. తాజాగా తెలంగాణలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వాట్సాప్ మేసేజ్ ఓ వ్యక్తి ప్రాణాన్ని తీసింది. వినటానికి షాకింగ్ గా ఉన్న ఇది నిజం. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. వాట్సాప్ మేసేజ్ ప్రాణం తీయడం ఏంటి? ఈ ఘటన వెనకాల అసలేం జరిగిందనే పూర్తి వివరాలు మీ కోసం. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా భీమగల్ పరిధిలోని కారెపల్లి గ్రామం. ఇక్కడే ధరావత్ మంతు, దేవిచంద్ అనే ఇద్దరు వ్యక్తులు నివాసం ఉంటున్నారు. వీళ్ల ఇళ్లు కూడా పక్క పక్కనే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ ఇద్దరు వ్యక్తులు వీరి ఇంటి సమీపంలో ఉన్న రోడ్డుపై కట్టెలు వేశారు. వెళ్లేవారికి ఇబ్బందిగా ఉండడంతో అదే గ్రామానికి చెందిన బంతిలాల్ అనే వ్యక్తి దానిని ఫోటో తీసి వారి గ్రామ వాట్సాప్ గ్రూప్ లో సెండ్ చేశాడు.
ఈ విషయం తెలుసుకున్న ధరావత్ మంతు, దేవిచంద్ ఇద్దరూ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే భార్యాభర్తలతో పాటు బంతిలాల్ ఇంటిపై దాడి చేశారు. అంతేకాకుండా అతడు ఎక్కడున్నాడని వెతికి మరి పట్టుకున్నారు. ఇంతటితో ఆగని ధరావత్ మంతు, దేవిచంద్.. గొడ్డలితో దాడి చేసి బంతిలాల్ అతి దారుణంగా నరికారు. బంతిలాల్ హత్య ఘటన తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే చనిపోయాడని తెలిపారు. అనంతరం ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.