పైన ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు రాజమణి. ఆమె గతంలో ఓ మహిళ ఇంట్లో పని మనిషిగా చేరింది. ఇక అప్పటి నుంచి అక్కడే పని చేస్తూ నమ్మకంగా మెలిగింది. కానీ, చివరికి రాజమణి ఇంతకు తెగిస్తుందని మాత్రం ఆ ఇంటి ఓనర్ ఊహించలేకపోయారు.
ఈ మహిళ పేరు రాజమణి. బతుకు దెరువు కోసం నగరంలోని ఓ ఇంటికి వెళ్లి పని కల్పించాలంటూ వేడుకుంది. కరిగిపోయిన ఆ ఇంటి ఓనర్.. ఆ మహిళను తన ఇంట్లోనే పని మనిషిగా చేయాలంటూ కోరింది. దీనికి రాజమణి సరేంటూ గత కొంత కాలంగా ఎంతో నమ్మకంగా అక్కడే పని మనిషిగా చేస్తూ వచ్చింది. ఆ ఇంటి ఓనర్ కూడా ఆ మహిళను పని మనిషిలా కాకుండా ఇంటి మనిషిలా చూసుకున్నారు. కానీ, రాజమణి అసలు రూపాన్ని ఆ ఇంటి ఓనర్ గుర్తించలేకపోయారు. అవును మీరు విన్నది. పని మనిషిలా ఉన్న రాజమణి ఎవరూ ఊహించని పాడు పనికి తెర లేపింది. ఏం చేసిదంటే?
పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ నగరంలోని గౌతం నగర్ లో దేవకత రాజమణి అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు ఎక్కడా పని లేకపోవడంతో సుభాష్ నగర్ లోని రాధా అనే మహిళ ఇంట్లో రాజమణి పని మనిషిగా చేరింది. అన్ని పనులు చేస్తూ ఇంటి సభ్యులతో ఎంతో నమ్మకంగా మెలిగింది. ఇంటి ఓనర్ రాధా కూడా ఆమెను పని మనిషిలా కాకుండా ఇంటి మనిషిలా చూసుకున్నారు. ఇంట్లో ఉన్న ప్రతీ వస్తువు ఎక్కడ ఉంటుందనేది రాజమణికి పూర్తిగా తెలుసు. అలా కొన్ని రోజులు గడిచింది. అయితే రాను రాను ఆ మహిళ తన అసలు రూపాన్ని బయటపెట్టింది. రాజమణి ఎప్పటిలాగే ఆదివారం కూడా రాధా ఇంటికి వెళ్లి పని పూర్తి చేసి సాయంత్రం తిరిగి తన ఇంటికి వెళ్లింది.
అదే రోజు నుంచి రాధాకు తన ఇంట్లో లక్షలు విలువ చేసే బంగారు అభరణాలు కనిపించలేదు. ఇల్లంతా వెతికినా కూడా ఆ గొలుసులు ఎక్కడా కనిపించలేదు. రాధాకు పని మనిషి రాజమణిపై కాస్త అనుమానం వచ్చింది. దీంతో వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానంతో పని మనిషి రాజమణిని అదుపులోకి తీసుకుని విచారించారు. మొదట్లో పొంతనలేని సమాధానాలు చెప్పిన ఆ మహిళ.. పోలీసుల స్టైల్ లో విచారించేసరికి తన నేరాన్ని అంగీకరించింది. అనంతరం పోలీసులు రాజమణిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేయాలని చూసిన రాజమణి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.