నవ మాసాలు మోసేది అమ్మ.. అల్లారు ముద్దుగా పెంచేది అమ్మ.. చందమామ రావే అంటూ గోరు ముద్దలు తినిపించేది అమ్మ.. మీకు దెబ్బ తగిలితే ఆమె కళ్లు చెమ్మగిల్లుతాయి. అలాంటి అమ్మ అనే పిలుపునకు ఈ మహిళ మాయని మచ్చను తెచ్చింది.
అమ్మ.. భాష ఏదైనా ఈ పిలుపులో మాధుర్యం ఉంటుంది. తల్లి కావాలి అని ప్రతి స్త్రీ కోరుకుంటుంది. కొందరైతే అమ్మ అనే పిలుపు కోసం పరితపిస్తుంటారు. మొక్కులు మొక్కి, ఆస్పత్రులు చుట్టు తిరిగి పిల్లల కోసం తాపత్రయపడే వాళ్లు ఎందోరు ఉన్నారు. అయితే ఏ విషయంలో అయినా మంచి- చెడు, బొమ్మా- బొరుసు ఉండనే ఉంటాయి. కొందరు కన్నపిల్లలను అల్లారు ముద్దుగా పెంచుతుంటే.. ఇంకొందరు మాత్రం కర్కశంగా కాటికి పంపుతున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే ఓ మహిళ కూడా రెండో కేటగిరీకి చెందిందే. తన జల్సాలకు అడ్డుగా ఉన్నాడని కొడుకుకే కడతేర్చింది.
ఇప్పుడు చెప్పుకోబేయే మహిళ.. అమ్మ అనే పిలుపుకే కళంకం తెచ్చింది. నవమాసాలు మోసి, కని పెంచిన కన్న కొడుకుని అతి దారుణంగా హత్య చేసింది. ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలో జరిగింది. సీఐ నరహరి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 13 ఏళ్ల క్రితం సంతోష్ నగర్ కు చెందిన భరత్ అనే వ్యక్తితో లావణ్యకు వివాహం జరిగింది. గతంలో మేస్త్రీ పని చేస్తూ కామారెడ్డి, ఇందల్ వాయి ప్రాంతాల్లో జీవించారు. గత రెండేళ్లు గా మాత్రం నాగారం పరిధి సంతోష్ నగర్ లో నివాసముంటున్నారు. మంగళవారం ఉదయం లావణ్య తన కుమారుడు సంతోష్(8)ని తీసుకుని బయటకు వెళ్లింది.
రాత్రి సమయంలో వేరే వ్యక్తితో కలిసి రోహిత్ ని నిజాంసాగర్ కెనాల్ వద్దకు తీసుకెళ్లారు. అప్పుడు లావణ్య పూర్తి మద్యం మత్తులో ఉంది. రోహిత్ గొంతునులిమి చంపేసింది. బుధవారం ఉదయం తెల్లవారుజామున అటుగా ఓ వ్యక్తి వెళ్తుండగా రోహిత్ మృతదేహం కనిపించింది. లావణ్య కూడా అక్కడే ఉంది. ఆమె అప్పటికే మద్యం మత్తులోనే ఉన్నట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న భర్త అక్కడకు చేరుకుని కుమారుడి మృతదేహం చూసి గుండెలవిసేలా విలపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందిచడమే కాకుండా ఆమెపై ఫిర్యాదు కూడే చేశాడు. మద్యానికి బానిసగా మారిన లావణ్య జల్సాలకు అలవాటు పడింది. ఆమె సుఖాలకు అలవాటు పడి.. డబ్బు కోసం వ్యభిచారాన్ని ఎంచుకుంది. ఆమె పనులకు అడ్డొస్తున్నాడని రోహిత్ ని హతమార్చింది.
అయితే ఆమె రెండేళ్ల క్రితం కామారెడ్డిలో ఉన్న సమయంలో మద్యం మత్తులో చిన్న కొడుకుని కూడా హత్య చేసిందని పోలీసులకు తెలియజేశారు. చిన్న కొడుకుని చంపబట్టే.. కామారెడ్డి నుంచి నిజామాబాద్ కి మారినట్లు వెల్లడించారు. భర్తపై కూడా బ్లేడుతో హత్యాయత్నం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పది రోజుల క్రితమే ఓ చెరువు దగ్గర రోహిత్ ని చంపేందుకు ప్రయత్నించగా.. స్థానికులు అడ్డుకోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలియజేశారు. జల్సాల కోసం కన్న కొడుకలను కాటికి పంపిన ఈ మహిళకు ఎలాంటి శిక్ష పడాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.