నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి చేయట్లేదని తండ్రి, బాబాయ్ ని ఓ కొడుకు దారుణంగా కర్రతో కొట్టి చంపాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని మోగ్పాల్ గ్రామంలో కర్ర అబ్బయ్య అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి కర్ర సతీష్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే గత కొంత కాలం నుంచి సతీష్ నాకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులను వేధిస్తున్నాడు.
తండ్రి మాత్రం తన కుమారుడికి ఏదో ఒకటి చెబుతు వాయిదాల పర్వాన్ని కొనసాగించాడు. ఇదే విషయమై సతీష్ ఇటీవల మరోసారి తండ్రితో గొడవకు దిగాడు. దీంతో తండ్రీ కొడుకుల మధ్య చిన్నపాటి వార్ మొదలైంది. ఒకరిపై ఒకరు మాటల దాడికి దిగారు. వీరి గొడవ తీవ్ర రూపం దాల్చింది. ఈ క్రమంలోనే సతీష్ బాబాయ్ తండ్రీకొడుకులను ఆపే ప్రయత్నం చేశాడు. ఇక సతీష్ కోపం కట్టలు తెంచుకుంది.
దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ యువకుడు కర్రతో తండ్రి తలపై బలంగా బాది హత్య చేశాడు. అడ్డొచ్చిన బాబాయ్ ని సైతం తలపై బాదాడు. ఈ దాడిలో అన్నదమ్ములు ఇద్దరూ మరణించారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పెళ్లి చేయట్లేదని తండ్రిని, బాబాయ్ ని కొట్టి చంపిన సతీష్ దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.