ఇప్పుడు చేసే ప్రతీ శుభకార్యంలోనూ అందరూ ఖచ్చితంగా వచ్చిన బంధువులకు విందును ఏర్పాటు చేస్తున్నారు. వచ్చిన బంధువులకు ఈ విందులో భాగంగా మాంసహారంతో పాటు, శాఖహార భోజనం కూడా ఏర్పాటు చేస్తుంటారు. ఇక నచ్చిన వంటకం ఉంటే ఎవరైనా సరే రెండు మూడు సార్లు తింటుంటారు. అలాగే తినేందుకు ప్రయత్నించిన ఓ మహిళ తల పగలగొట్టారు. వినటానికి భయంకరంగా ఉన్న ఇది నిజం.
తాజాగా నిర్మల్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని కుబీర్ మండలం సేవాదాస్ నగర్ తండా. ఇదే తండాలో గత రెండు రోజుల క్రితం ఓ శుభకార్యం జరిగింది. శుభకార్యంలో భాగంగానే విందును ఏర్పాటు చేశారు. ఇక ఇదే తండాకు చెందిన రాజోభాయ్ అనే మహిళ విందులో పాల్గొని భోజనం చేస్తూ ఉంది.
ఇది కూడా చదవండి: Tamil Nadu: వివాహితపై వలస కార్మికులు సామూహిక అత్యాచారం! ఆపై పెట్రోల్ పోసి తగులబెట్టారు!
అయితే నచ్చిన వంటకం కావడంతో ఈ మహిళ మరోసారి కూడా భోజనం చేసింది. దీనిని గమనించిన కొందరు ఆ మహిళను అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇరువర్గాలు తీవ్ర స్థాయిలో కర్రలతో దాడి కూడా చేసుకున్నారు. ఈ దాడిలో రోజాభాయ్ తలకి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెతో పాటు పలువురికి కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర రక్తంలో పడి ఉన్న రోజాభాయ్ ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై వెంటనే స్పందించిన బాదితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాదితుల ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇటీవల జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. రెండు సార్లు భోజనం చేసిందని మహిళ తల పగలగొట్టిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.