నిర్మల్ జిల్లా సోఫీ నగర్ కి చెందిన సంయుక్త ( 24) బీటెక్ పూర్తి చేసి ఉన్నత చదువులు చదువుతోంది. అయితే ఈ క్రమంలోనే తల్లిదండ్రులు అమెను ఓ యువకుడికి ఇచ్చి ఇటీవల వివాహం జరిపించారు. భర్తతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న ఆ యువతికి మొదట్లోనే ఆటంకాలు ఎదురయ్యాయి. భర్తతో పాటు అత్తామామల వేధింపులు భరించలేక నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. అది నిర్మల్ జిల్లా సోఫీ నగర్ ప్రాంతం. బీటెక్ పూర్తి చేసిన సంయుక్తను నిజామాబాద్ జిల్లాకు చెందిన ఉత్తేజ్ కుమార్‌కు ఇచ్చి ఏప్రిల్ 7న ఘనంగా పెళ్లి చేశారు. ఉత్తేజ్ కొండాపూర్‌లోని యాక్సిస్ బ్యాంక్‌లో డిప్యూటీ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా పెళ్లైన నాలుగు రోజుల తర్వాత భర్తతో పాటు అత్తామామలతో కలిసి ఓ గుడికి వెళ్లారు. అలా వెళ్లిన క్రమంలో వారి కారు రోడ్డు ప్రమాదానికి గురైంది.
ఇది కూడా చదవండి: Madhya Pradesh: భర్త కళ్లముందే వృద్దుడితో భార్య గలీజ్ పని.. కట్ చేస్తే భర్తతో కలిసి ప్రియుడిని హత్య చేసిన ప్రియురాలు!
కోడలు అడుగుపెట్టడంతో అపశుకనంలా ఈ ప్రమాదం చోటు చేసుకుందని, కొత్త కారు కొనివ్వాలంటూ సంయుక్తపై వేధింపులకు దిగారు. ఇక ఇదే కాకుండా నిన్ను చేసుకున్నందుకు రూ.15 లక్షల కట్నం, 10 తులాల బంగారం ఇచ్చారని, వేరే అమ్మాయిని చేసుకుంటే కట్నం ఎక్కువగా వచ్చేదంటూ వేధింపులకు గురి చేసేవారు. కొన్ని రోజుల తర్వాత భార్యాభర్తలు సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ బంధం కొమ్ము గ్రామం శ్రీదామా హిల్స్‌లో కాపురం పెట్టారు. ఇక భర్త కూడా అదనపు కట్నం కోసం వేధించడంతో సంయుక్త తట్టుకోలేకపోయింది. అటు అత్తామామలు, ఇటు భర్త వేధింపులను సంయుక్త తట్టుకోలేక తీవ్ర మనస్థాపానికి గురైంది.
ఏం చేయాలో తెలియక బుధవారం భర్త ఇంట్లో లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న సంయుక్త కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై సంయుక్త తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నా కూతురిది ఆత్మహత్య కాదని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.