ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలు కూడా పెళ్ళికి ఒప్పుకున్నారు. ఓ గుడిలో పెళ్లి కూడా చేసుకున్నారు. కట్ చేస్తే 10 రోజుల తర్వాత కొత్తగా పెళ్ళైన దంపతులు కనబడడం లేదు. దీంతో పోలీసులకు పెద్ద సవాలుగా మారింది.
ఫేస్ బుక్ ద్వారా పరిచయాలు ఏర్పడ్డాయి. అలా చాటింగ్ ద్వారా ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడింది. ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని భావించి ఇంట్లో వాళ్ళను ఒప్పించారు. 10 రోజుల క్రితం పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే ఊహించని విధంగా ఇద్దరి జీవితాల్లో ట్విస్ట్ ఎదురైంది. తమ కొడుకు కనబడడం లేదని వరుడి తల్లిదండ్రులు, తమ కూతురు కనబడడం లేదని వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేరళలోని హరిపాడ్ కార్తికపల్లికి చెందిన అనిల్ కుమార్ అనే వ్యక్తి కొడుకు అఖిల్ (22)కి, కర్ణాటకలోని బెంగళూరులోని కస్తూరి నగర్ కు చెందిన పి. కృష్ణ అనే వ్యక్తి కూతురు విద్యాశ్రీ (18)కి మార్చి 30న వివాహం జరిగింది.
ఈ ఇద్దరికీ ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ ప్రేమించుకున్నారు. మార్చి 30న కేరళలోని అళప్పుళ్ జిల్లాలోని ఓ దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత బెంగళూరు వచ్చారు. అయితే వధువును కొంతమంది దుండగులు కిడ్నాప్ చేశారు. శనివారం నాడు తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో విద్యాశ్రీ తల్లిదండ్రులపై దాడి చేసి ఆమెను కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే అఖిల్ కిడ్నాప్ అయ్యాడని అతని కుటుంబ సభ్యులు తిర్కున్నపుళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ కేసులో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.
అఖిల్, విద్యాశ్రీలను ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు? కిడ్నాప్ చేయవలసిన అవసరం ఏముంటుంది? విద్యాశ్రీని వేరే ఎవరైనా లవ్ చేశారా? గతంలో ఈమెకు ఏమైనా లవ్ స్టోరీ ఉందా? మాజీ ప్రియుడు వచ్చి ఇద్దరినీ కిడ్నాప్ చేశాడా? లేక విద్యాశ్రీ, అఖిల్ ల ప్రేమ ఇంట్లో వారికి నచ్చలేదా? నచ్చని కారణంగానే ఒకరిని కిడ్నాప్ చేసి.. ఇంకొకరిని దాచి పెట్టి కిడ్నాప్ అయినట్లు డ్రామా ఆడుతున్నారా? లేదంటే ఆర్య2 సినిమాలో అల్లు అర్జున్ లా.. విద్యాశ్రీని వేరే వ్యక్తికిచ్చి పెళ్లి చేయాలని అఖిల్ ఆమెను వేరే చోటికి తీసుకెళ్లిపోయాడా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. మరి పెళ్ళైన పది రోజుల తర్వాత దంపతులు కనబడకపోవడానికి కారణం ఏమై ఉంటుందో మీరు ఊహించగలరా? మీ గెస్ ఏంటో కామెంట్ చేయండి.